ఆసుపత్రిలో రవితేజ హడావుడి?

Tuesday, July 31st, 2018, 01:16:54 AM IST

మాస్ మహారాజ రవితేజ ఇటీవల అంధుడుగా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఆ తరువాత అయన నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఆయన కొంత ఆలోచనలో పడ్డారట. అందుకే ఆచితూచి అలోచించి తదుపరి అవకాశాన్ని ప్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా తనకు వెంకీ, దుబాయ్ శీను వంటి హిట్స్ అందించిన శ్రీను వైట్లకు ఆయన దర్శకత్వం పై నమ్మకంతో మరొక అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. రవితేజ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలనుండి వార్తలు వస్తున్నాయి.

గోవా భామ ఇలియానా మరొకసారి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీఇస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లోని చిత్రపురి కాలని పరిసర ప్రాంతాల్లోని సన్ షైన్ హాస్పిటల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోందట. ఈ సన్నివేశాలు సినిమాలో ప్రధానమయినవని తెలుస్తోంది. ఇక షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ అమెరికాకు షిఫ్ట్ అవుతుందని, అక్కడినుండి షూటింగ్ నిరంతరాయంగా జరుగుతుందని సమాచారం. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనే కసితో టీం మొత్తం పని చేస్తుందట. చూద్దాం మరి వారి ఆశలు ఫలించి అటు రవితేజ, ఇటు శ్రీను వైట్ల ఏ మేరకు హిట్ కొట్టి ఈ సారి ఫామ్ లోకి వస్తారో….

  •  
  •  
  •  
  •  

Comments