వాట్ నెక్స్ట్ .. పూరి సర్ ?

Thursday, May 17th, 2018, 11:19:40 AM IST

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న క్రేజీ దర్శకుడు పూరి జగన్నాధ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మహబూబా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావొచ్చన్న కలలపై మెహబూబా నీళ్లు పోసింది. హీరోలు దొరక్క తన తనయుడితోనే ఈ సినిమా తెరకెక్కించాడు. కథలో విషయం .. కథనంలో పూరి మార్క్ లేకపోవడంతో సినిమా జనాలకు ఎక్కలేదు. ఈ సినిమా విడుదలై వారం పూర్తయినా కూడా వసూళ్ల పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదు. సొంత బ్యానర్ లో ఈ సినిమా తీయడంతో మరింత దెబ్బ పడింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ సినిమా చేస్తానంటే కనీసం చిన్న పాటి హీరోలు కూడా ముఖం చాటేసే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మెహబూబా సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్యను పొగిడేసాడు పూరి ..మరి పూరి జగన్నాద్ మళ్ళీ బాలయ్య పని చేస్తాడా .. లేక మరో హీరో గట్టెక్కిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments