పూరి నెక్స్ట్ ఏంటి ?

Sunday, May 13th, 2018, 11:22:39 PM IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం మెహబూబా చాలా చోట్ల మిశ్రమ స్పందనతో సాగుతోంది. నన్ను ఏ హీరో నమ్మనప్పటికీ మా అబ్బాయి నమ్మాడు, సినిమా చాలా కష్టపడి తీసాను, మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని పూరి మెహబూబా ఆడియో విడుదల వేడుకలో అన్నారు. ఆయన తనయుడు ఆకాష్ కూడా నా ద్వారా మా నాన్నగారికి మంచి కం బ్యాక్ సినిమాగా మెహబూబా నిలుస్తుంది అని ఆకాష్ ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. నిజానికి మెహబూబా విడుదలకు ముందు వేసిన ప్రివ్యూ షో చూసిన వారందరు చాలా బాగుందని ఆయన్ని ప్రశంసించారు. అయితే ఆ తర్వాత విడుదల రోజు నుండి మిశ్రమ స్పందన రావడం మొదలయింది. కొందరైతే పూరి తన మార్క్ చిత్రంలా మహేహబూబా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

అప్పుడు కాస్త సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఫన్, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ అయినా చూడగలిగేవారము, కానీ మెహబూబా ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. నిజానికి పూరి, అయన తనయుడు ఆకాష్ ఈ చిత్రం మీద మంచి ఆశలే పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని కూడా తనయుడు ఆకాశతోనే తెరకెక్కిస్తారని అంటున్నారు. నిజానికి బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు వంటివి పూరి తీసిన వాటిల్లో ఎప్పటికీ నిలిచే అద్భుతాలు. అటువంటిది ఆయన మళ్ళి మనసుపెట్టి మంచి కథ రాస్తే మంచి విజయం తప్పక దక్కుతుందని, ఈ సారి ఆకాష్ తో చేయబోయే చిత్రం మరింత శ్రద్ధ, కసితో చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి………