ఏపీ స్పీకర్ ఎవరో తెలిసిపోయిందిగా…?

Thursday, June 6th, 2019, 12:05:17 AM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో విజయ పథకాన్ని ఎగురవేసి వెనువెంటనే అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత తన మంత్రి వర్గ విస్తరణలో మాత్రం కాసింత జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలుస్తుంది. దానికి కారణం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా ఇప్పటికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ ని నియమించకపోవడమే అని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారందరు కూడా ప్రమాణస్వీకారం చేసేదాకా ప్రొటెం స్పీకర్ గా ఎవరో ఒకరు ఉంటారు కానీ, ఐదేళ్లపాటు ఎవరు స్పీకర్ గా కొనసాగుతారా అనే అంశం మీద ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ మాత్రం అంతగా పట్టించుకోవడం లేదనే వాదనలు బాగానే వినిపిస్తున్నాయి.

కాకపోతే స్పీకర్ గా ఎవరిని నియమించాలి అనేది జగన్ ఇప్పటికే ఆలోచించుకున్నారని, అందుకోసమే అంత ధీమాగా ఉన్నారని తెలుస్తుంది. వారిలో కొందరి ప్రముఖుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అని, మరొకరు నగరి ఎమ్మెల్యే రోజా అని, మరొకరు ఆనం రాంనారాయణ రెడ్డి అని అంటున్నారు. కాగా తాజాగా ఈ లిస్టులోకి మరొకరి పేరు బయటకొచ్చింది. గత స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కి ముచ్చెమటలు పట్టించిన సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు కూడా బాగానే వినిపిస్తుంది. విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే నేర్పరి అయిన అంబటి ఈ స్పీకర్ పదవి సరిగ్గా సరిపోతుందని, అందుకనే ఈయన పేరు జగన్ అనుకున్నారని సమాచారం. కానీ ఈ వివరాలన్నీ కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.