బన్నీ ఎక్కడున్నావ్..? ఎం చేస్తున్నావ్..?

Tuesday, September 11th, 2018, 05:35:43 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఎం చేస్తున్నాడో. ఏమి తెలీడం లేదు. ఆయన తాజాగా నటించిన చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసినదే, కానీ ఆ చిత్రాన్ని అల్లు అర్జున్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తీశానని తెలిపారు. వక్కంతం వంశీ కి కూడా ఈ చిత్రానికి మొట్ట మొదటిసారిగా దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. మన టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు బాగానే ఉన్నా ఎందుకు ఈ సినిమా ఆడలేదు అనే కోవకి ఈ చిత్రం కూడా వెళ్ళిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ చిత్రం పరాజయం తర్వాత ఆ చిత్ర హీరో కానీ దర్శకుడు కానీ వారి తర్వాతి ప్రాజెక్ట్ ఏంటో అనేది కూడా వెలువరించలేదు. చక చక సినిమాలు పూర్తి చేసేసి వెంటనే తర్వాతి సినిమాకు రెడీగా ఉండే బన్నీ ఈ చిత్రం తర్వాత ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడో? ఎవరికీ తెలీడంలేదు. తమ అభిమాన నటుడు నుంచి కొత్త చిత్రం కోసం ఎప్పుడు ప్రకటిస్తారా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ తర్వాతి సినిమా “మనం”,”24″,”ఇష్క్” లాంటి చిత్రాలను అందించిన విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ఉండబోతుంది అని సమాచారం ఐతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలయ్యిపోవాల్సినది. కానీ ఎందుకో మళ్ళీ ముందుకు సాగలేదు, కానీ ఇప్పుడు త్వరలోనే ఈ చిత్రం మొదలయ్యిపోతుంది అని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మస్తున్నారు అని తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments