కరోనా వైరస్ ల్యాబ్ లో సృష్టించింది కాదు – డబ్ల్యూహెచ్ఓ

Wednesday, February 10th, 2021, 08:39:24 AM IST

Corona

ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన కరోనా వైరస్ మహమ్మారి నీ ల్యాబ్ లో సృష్టించింది కాదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ మహమ్మారి ఎక్కడ పుట్టింది అనే దాని పై మరింత అధ్యాయనం అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం తెలిపింది. వూహాన్ మార్కెట్ లో గడ్డ కట్టిన మాంసం నుండి వైరస్ పుట్టి ఉండవచ్చు అని స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, నేరుగా మనుషులకే సోకిందా అనే విషయం నిర్ధారించడం లో విఫలం అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అయితే ఈ వైరస్ ను చైనా ఊహాన్ లో తయారు చేసింది అంటూ పలు అగ్ర దేశాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మరియు చైనా శాస్త్రవేత్తల బృందం ప్రకటించాయి. అయితే ఈ విషయం పై ఇంకా అధ్యయనం అవసరం అని తేల్చి చెప్పింది. అయితే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం లో మొత్తం పది దేశాలకు చెందిన నిపుణులు ఉన్నారు.