ఫోటో టాక్‌ : అదాకి ఫిదా అవ్వ‌నిదెవ్వ‌రు?

Monday, June 11th, 2018, 02:10:51 PM IST

అందాల అదాశ‌ర్మ‌కు ఫిదా అవ్వ‌కుండా ఉండ‌గ‌ల‌రా? ఈ అమ్మ‌డి కొంటె కోనంగి వేషాల‌కు తెలుగు జ‌నం ఎప్పుడో క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ముంబై టు హైద‌రాబాద్‌, హైద‌రాబాద్ టు చెన్న‌య్ .. ఈ అమ్మ‌డు బిజీబిజీగా తిరుగుతోంది. ఈ బిజీలోనే వీలున్న‌ప్పుడ‌ల్లా సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు వ‌ల‌లు వేస్తోంది. అక్క‌డ ర‌క‌ర‌కాల కొంటె కోనంగి వేషాల‌తో గుండెను గిల‌క్కొడుతోంది. యూత్ అదే ప‌నిగా అదా కి అదా ట్విట్ట‌ర్‌ని ఫాలో అయ్యేలా.. త‌న కోస‌మే క‌ల‌వ‌రించేలా చేసింది. అక్క‌డ డ్యాన్సుల వీడియోలు, వేసే ప్ర‌తి కొంటె వేషాన్ని పోస్ట్ చేసింది.

తాజాగా ఓ అదిరిపోయే ఫోటోని పోస్ట్ చేసి మరోసారి వేడెక్కించింది. ఈ ఫోటోలో అదా కాస్తంత సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగానే క‌నిపిస్తోంది. అంద‌మైన డిజైన‌ర్ వేర్‌.. అద్భుత‌మైన లీఫ్ స్టైల్ చున్నీతో ఆక‌ట్టుకుంది. అదాకి ఆ క‌ళ్లే ఆక‌ర్ష‌ణ‌. అంత అంద‌మైన కాటుక క‌ళ్ల‌తో గిల్లుడే గిల్లుడు ఈ భామ‌. అందుకే అదా ఏ వేషం వేసినా యూత్‌కి కిక్కెక్కేస్తోంది. ఇంత‌కీ ఈ భామ ఏ సినిమాల్లో న‌టిస్తోంది? అంటే ఇప్ప‌టికి ఓ త‌మిళ సినిమా చేస్తోంద‌న్న స‌మాచారం ఉంది. ఇక తెలుగులో, హిందీలో ఖాళీ. చెప్పుకోద‌గ్గ ప్రాజెక్టులైతే లేనేలేవెందుకో! ప్చ్‌!!