`సాహో`ని లీడ్ చేసే కీలీడ్ ఎవ‌రు?

Tuesday, July 31st, 2018, 02:15:48 PM IST

అవును..ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బాహుబ‌లి అభిమానుల్ని వేధిస్తున్న ప్ర‌శ్న ఇది. అమ‌రేంద్ర బాహుబ‌లిగా అసాధార‌ణ‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ క చిత్రం `సాహో` అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచుతోంది. అస‌లింత‌కీ ఈ సినిమాని లీడ్ చేసేది ఎవ‌రు? ప్ర‌భాస్ కాదా?.. తెలియాలంటే డీప్‌గా డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.

ప్ర‌ఖ్యాత యు.వి.క్రియేష‌న్స్ సంస్థ దాదాపు 300కోట్ల పెట్టుబ‌డితో తెర‌కెక్కిస్తున్న సినిమా – సాహో. ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కూ రాని విధంగా ఈ యాక్ష‌న్ ఎడ్వంచ‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ ఓ కాప్ పాత్ర‌లో న‌టిస్తాడ‌ని, లేదు గ‌జ‌దొంగ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్రచారం సాగుతోంది. అయితే ఈ గ‌జ‌దొంగ‌ను డీల్ చేసే కీల‌క పాత్ర గురించి తాజాగా లీకులందాయి. ఈ చిత్రంలో క‌థానాయిక అని చెబుతున్న శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర ఏంటో రివీలైంది. అస‌లు సాహోని లీడ్ చేసిది ప్ర‌భాస్ కాదు, శ్ర‌ద్ధాక‌పూర్ అన్న మాటా వినిపిస్తోంది. అస‌లు క‌థంతా శ్ర‌ద్ధా నేరేష‌న్‌లోనే సాగుతుందిట‌. అంటే శ్ర‌ద్ధా క‌థ చెబుతుంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు జుయ్ జుయ్‌మ‌ని మెరుపుల్లా వ‌చ్చి వెళుతుంటాయి. ఆ మెరుపుల్లో ఉరుములాగా వ‌చ్చి ప‌డ‌తాడు ప్ర‌భాస్‌. అందుకే ఇండియాస్ బెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అంటే కేవ‌లం అది ప్ర‌భాస్ షో మాత్ర‌మే కాదు. ఇందులో శ్ర‌ద్ధా పాత్ర అంతే కీల‌కం. అలానే విల‌న్ల పాత్ర‌ల‌కు అంతే ప్రాధాన్య‌త‌నిస్తూ ఈ సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుందిట‌. ఇక రెగ్యుల‌ర్ తెలుగు సినిమాలా కాకుండా ఓ అంత‌ర్జాతీయ ఆడియెన్ వీక్షించే క‌థ‌తో ఈ సినిమా ఉత్కంఠ పెంచుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా పాత్ర‌పై చిత్రీక‌ర‌ణ తిరిగి మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ క్లాప్ కొట్టిన ఫోటోని ఈ ముద్దుగుమ్మ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments