బిగ్ బాస్ ఉత్కంఠ… ఫైనల్ విన్నర్ ఎవరంటే?

Sunday, September 24th, 2017, 05:47:09 PM IST

స్టార్ మా ఎన్టీఆర్ సారధ్యం లో ఏకంగా 7౦ రోజుల పాటు నడిచిన బిగ్ బాస్ సీజన్ వన్ రియాలిటీ షో ఈ రోజుతో ముగియనుంది. ఇంత వరకు తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాని ఓ సరికొత్త షోని ప్రతి ఇంటికి చేర్చడంలో షో నిర్వాహకులు ఎంత సక్సెస్ అయ్యారో తెలీదు కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ షో ద్వారా తెలుగు నాట ప్రతి ఇంటికి వెళ్ళిపోయాడు. మొదట్లో ఈ షో మంచి రేటింగ్స్ తో భాగా ఆసక్తిగా సాగింది. అయితే రానురాను షో మీద జనం ఆసక్తి తగ్గిన శని, ఆదివారాల్లో మాత్రం ప్రతి ఇంట్లో ప్రేక్షకులు టీవీ స్క్రీన్స్ కి అతుక్కుపోయే వారు. ఈ షో ఎంతగా సక్సెస్ అయ్యింది అంటే పల్లెటూళ్ళో కూడా బిగ్ బాస్ షో గురించి రచ్చబండల మీద కూర్చొని అందరు మాట్లాడుకునేంతగా. మరి అలాంటి షో ముగింపు దశకి వచ్చేసింది. ఎన్టీఆర్ అద్బుతమైన యాంకరింగ్ తో అందరికి ఆకట్టుకొని దిగ్విజయంగా చివరికి తీసుకొచ్చారు.

ఇక ఈ షో ఫైనల్ స్టేజికి వచ్చింది. ఇప్పుడు షోలో మొత్తం 5 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. వారిలో విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు అందరికి ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇప్పటి వరకు సరదా సరదాగా సాగిపోయిన షో హిందీ బిగ్ బాస్ షో అంత హైప్ క్రియేట్ చేయకపోయిన, ప్రేక్షకులకి మాత్రం భాగా చేరువ అయ్యింది. ఈ షో లో ఉన్న వారిని చూసుకుంటే హరితేజ, అర్చన, శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్. వీళ్ళలో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. మరి వైపు ఈ షోలో ఉన్న వారికి ఓటింగ్ చేయాలని ఎవరి సపోర్టర్ వారికి మద్దతుగా ఫ్లెక్సీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కాంపైన్ నిర్వహిస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేదాని మీద బెట్టింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే మరో వైపు సోషల్ మీడియా లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటూ కొందరి మీద వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో నిజానిజాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు కాని, బిగ్ బాస్ షో ఎవరు అనేది ఈ రోజు సాయంత్రానికి తెలిసిపోతుంది. మరి 50 లక్షల కాష్ ప్రైజ్ అందుకునే విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి గా ఎదురుచూడండి.

  •  
  •  
  •  
  •  

Comments