అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో .. లైన్ లోకి పలువురు దర్శకులు ?

Saturday, February 10th, 2018, 02:38:39 PM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించే తదుపరి సినిమా ఎవరితో అనే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి? ఇప్పటికే అఖిల్ మొదటి సినిమా భారీ పరాజయంతో బ్రేక్ తీసుకున్న అఖిల్ తన రెండో చిత్రంగా హలో తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించాక కేవలం హిట్ గా మాత్రమే మిగిలింది. దాంతో టెన్షన్ లో పడ్డ నాగార్జున అఖిల్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ కోసం పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా అఖిల్ తో సినిమా చేసేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా పూర్తీ చేసిన అయన తనతదుపరి చిత్రంగా అఖిల్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మరో వైపు దర్శకుడు పూరి జగన్నాధ్ తో కూడా సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు .. అయన ఎవరో కాదు సత్య పినిశెట్టి. హీరో ఆది పినిశెట్టి అన్న అయినా సత్య ఇదివరకే మలుపు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో రెండు చిత్రాలను చేసిన అయన తాజగా అఖిల్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఫైనల్ గా అఖిల్ మూడో సినిమా ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.