మనిషి భయం… పోయే ప్రాణాలు 22.. జరిగే ఘోరంలో తప్పు ఎవరిది!

Friday, September 29th, 2017, 06:01:32 PM IST


మానవ మేధస్సుతో ఎన్నో అద్బుతాలు చేస్తున్నాడు. సాంకేతిక విప్లవం సృష్టించి ప్రపంచాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నాడు. కాని ఆ మానవ మేధస్సులో ఉన్న అవలక్షణాలు ఇప్పటికి జయిన్చాలేకపోతున్నాడు. ప్రమాదం జరిగే సమయంలో కనీసం అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తనని తాను రక్షించుకోవడానికి మరో కొంత మందిని తెలియకుండానే చంపుతున్నాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత మంది ప్రాణాలు అకారణంగా తీసేస్తున్నాడు. భయం అనే ఒక అవలక్షణం జయించలేక మరో మనిషి చావుకి కారణం అవుతున్నాడు. సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో ఊహించని ప్రమాదాలకి కారణం అవుతున్నాడు.

తాజాగా ముంబై రైల్వే స్టేషన్, దేశానికి ఆర్ధిక రాజధాని, కాని అక్కడ ఉన్న పాదచారుల బ్రిడ్జ్ లు ఎప్పుడో పాతకాలంలోనే ఉండిపోయాయి. నిత్యం వేలు, లక్షల్లో ప్రజలు నడుస్తూ ఉంటారు. కాని దాని కోసం కనీసం అభివృద్ధి చేయకపోవడం, ఆ పాతకాలపు పాదచారుల వంతెన ఓ పెద్ద ప్రమాదం సృష్టిస్తుంది అని ఎవరు ఊహించి ఉండరు. అయితే అక్కడ ప్రమాదానికి కారణం వంతెన కాదు. ప్రమాద స్థితిలో ఉన్న దాని పరిస్థితి. ఆ వంతెన చూస్తున్న ప్రతి సారి మనుషుల్లో కలిగే భయం ఒక మారణహోమం సృష్టించింది. 22 మంది చావుకి కారణం అయ్యింది. వంతెన కూలుతుందేమో అనే భయంతో ఇష్టానుసారంగా పరుగులు తీసిన జనం ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఆ తొక్కిసలాటలో అకారణంగా 22 ప్రాణాలు కోల్పోయారు వందల్లో క్షతగాత్రులుగా మారారు. ఈ ప్రమాదం యాదృశ్చికం అనుకోవాలా, లేక క్రూరమైన హత్యలు గా పరిగణించాలా, ఒక మనిషిని మరో మనిషి చంపితే హత్య అనేటపుడు, ఈ తొక్కిసలాటలో జరిగిన చావులని ఎలా పరిగణించాలి. ఇప్పటికి, ఎప్పటికి అర్ధం కాని విషయమే.

ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇండియాలో జరిగింది మొదటి సారి కాదు 20 సార్లుకి పైగా జరిగాయి ప్రతి సారి 20 మందికి పైగా మృతి చెందిన తొక్కిసలాటలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ తొక్కిసలాటలు జరిగిన తర్వాత ప్రతి సారి ప్రభుత్వాలు స్పందిస్తాయి తప్ప, ఇవి జరగకుండా ఆపే ప్రయత్నాలు మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. తాజాగా జరిగిన ముంబై తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్ష్ గ్రేషియా ప్రకటించింది, ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతి సారి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటుంది. ఈ ఘటనల వెనుక బాధ్యులు ఎవరు అంటే అందులో ప్రజల భయం ఒకటి ఉంటె, మరొకటి ప్రభుత్వాల నిర్లక్షం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలని కూడా ప్రభుత్వాలు చిన్నవి చేసి చూపించడానికి ప్రయత్నిస్తాయి.

గోదావరి పుష్కరాల్లో తోక్కిసలాలలో 27 మంది చనిపోయారు. అది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలు అని ఇప్పటికి చాలా మంది అంటూ ఉంటారు. అయితే దాని మీద ఎంక్వయిరీ కమిటీ వేసిన, వారు ఎం నివేదిక ఇచ్చారు అనేది ఇప్పటి వరకు తెలియని విషయం. ఇలాంటి ఘటనల పై ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంటుంది అనేది దీనికి నిదర్శనం ఇప్పుడు జరిగిన తొక్కిసలాటని కూడా ఏదో ఒక విధంగా తొక్కేసి కాలగర్భంలో కలిపేసే ప్రయత్నాలు మన పాలకులు చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలని సరైన విధంగా విచారిస్తే వీటి వెనుక ఉగ్రవాద ఆనవాళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరి మాట, ఆయుధం లేకుండా ఏకకాలంలో ఎక్కువ మందిని చంపడానికి ఇలాంటి రద్దీ ప్రాంతాలని ఉగ్రవాదులు ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజానిజాలు ఏంటి అనేది తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments