సుకుమార్ కోసం క్యూ లో హీరోలు ?

Wednesday, April 4th, 2018, 10:03:05 PM IST

లెక్కల మాస్టారి లెక్కలు ఎప్పుడు తప్పవు .. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అచ్చమైన పల్లెటూరి యువకుడిగా చూపించి సంచలన విజయాన్ని అందించాడు సుకుమార్. ప్రస్తుతం ఎక్కడ చుసిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ వసూళ్లతో దుమ్ము రేపుతోంది. ఇక ఇప్పటి వరకు రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో ఊహించుకున్న ప్రేక్షకులు కూడా చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ లోని నటుడిని బయటకు తీసాడు చరణ్ అని చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే నాకు ఇలాంటి ఛాన్స్ ఇప్పటిదాకా రాలేదని చెప్పాడు. సో మిగతా స్టార్ హీరోలు సుకుమార్ తో సినిమా చేయాలనీ తెగ ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. ఇప్పటికే మైత్రి బ్యానర్ లోనే మరో సినిమాకు కమిట్ అయినా సుకుమార్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సుకుమార్ నెక్స్ట్ సినిమాలో అల్లు అర్జున్ లేదా ప్రభాస్ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది .ఇప్పటికే ప్రభాస్ కోసం సుక్కు కూడా ఓ స్టోరీ అనుకున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి సుకుమార్ తో ప్రభాస్ సినిమా అంటే ఆ అంచనాలు వేరేగా ఉంటాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments