యూట్యూబ్ టాప్ ట్రెండింగ్..గాన కోకిల “బేబి” అసలు ఎవరు ఈమె..?

Saturday, December 1st, 2018, 09:07:38 PM IST

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పేరు ఏదన్నా ఉంది అంటే అది “బేబి” అని చెప్పాలి.అసలు ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు. కానీ ఈమెకున్న ప్రతిభే ఇప్పుడు తనని సినిమా రంగం వరకు తీసుకెళ్లింది.”ఓ చెలియా” అనే ఒక్క పాట సాదా సీదాగా పాడుకున్న పాట ఈమెకు ఇంత గుర్తింపు తీసుకొచ్చి మెగాస్టార్ చిరంజీవి దగ్గర వరకు తీసుకెళ్లింది.సినిమాలలో కూడా పాడేందుకు అవకాశం కూడా కల్పించింది.ఇంకా చెప్పాలి అంటే “మట్టిలో మాణిక్యం” అనే మాటకు సరైన ఉదాహరణగా ఈమెను చూపించొచ్చని అందరూ అంటున్నారు.

అయితే మరి అసలు ఈమె ఎవరు అన్న ప్రశ్న కూడా చాలా మంది మదిలో కూడా మెదిలే ఉంటుంది.అయితే ఈమె తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు అనే చిన్న కుగ్రామానికి చెందినవారు అని తెలిసింది.అయితే ఈమె తోటి వారి యొక్క ఇంటికి బట్టల గంజి కోసం అని వెళ్తే వారు మాములుగా పాట పాడమని అడగగా బేబి సరే అనడంతో అప్పుడు పాడినటువంటి పాటను వారు వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చెయ్యగా ఇంత సంచలనంగా మారి ఆమెకు ఇంత గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె తన చిత్రంలో పాట పాడేందుకు కూడా అవకాశం ఇచ్చారు.ఈమె ఎంత సంచలనంగా మారారు అంటే ప్రస్తుతం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో ఈమె వీడియో నిలిచింది.అంతే కాకుండా మొత్తం టాప్ 15 ట్రెండింగ్ వీడియోలలో కేవలం ఈమె ఒక్కరి కోసమే మూడు వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.దీనిని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు ఈమెను అందరు “మట్టిలో మాణిక్యం” అని ఎందుకు అన్నారో..