నిజమైన సంక్రాంతి విజేత ఎవరు ?

Tuesday, January 16th, 2018, 12:18:46 PM IST

ఎప్పటిలానే ఈ సంక్రాంతి కూడా మంచి రసవత్తర పోరు కు తెర లేపింది. మొత్తం 4 చిత్రాలు ఈ పండుగకు విడుదలయ్యాయి. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన అజ్ఞాతవాసి ఈ నెల 10 న విడుదల అయింది. పవన్ కి ఇది ప్రతిష్టాత్మక 25 వ చిత్రం కావటం, అందులోనూ త్రివిక్రంతో జల్సా, అత్తారింటికి దారేది వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తుండడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. పవన్ అభిమానులైతే నాన్ బాహుబలి రికార్డులు బద్దలవుతాయి అని అనుకున్నారు. అందరూ ఊహించినట్లే విడుదల కూడా అత్యధిక థియటర్లలో జరిగింది. కానీ చివరకు ఈ చిత్రం మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకుని అతిపెద్ద డిజాస్టర్ దిశగా ముందుకెళుతోంది. మరో వైపు బాల కృష్ణ హీరోగా 102 వ చిత్రంగా తమిళ దర్శకులు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం జైసింహ. మంచి హైప్, క్రేజ్ తో విడుదలయిన ఈ చిత్రం రొటీన్ మాస్ చిత్రం అనే పేరు తెచ్చుకుంది. మరో వైపు పెద్దగా ప్రచారం లేకుండా సూర్య హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం గ్యాంగ్ కూడా విడుదలయింది. టాక్ కొంతవరకు బాగున్నా థియేటర్ల కొరత సమస్య వల్ల, అలానే ప్రమోషన్ ఇంకొంచెం బాగుంటే బెటర్ గా కలెక్షన్లు వచ్చేవని అంటున్నారు. అయితే హీరో సూర్య చిత్ర విజయాన్ని మరింత పెంచేలా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పానాల్గొంటున్నారు.

చివరిగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన చిన్న చిత్రం రంగుల రాట్నం ఈ ఆదివారం పండుగ కానుకగా విడుదలయింది. అయితే పెద్ద బ్యానర్ నుండి రావడం,
అందునా ట్రైలర్ ని బట్టి చూస్తే మంచి లవ్ , ఫామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, తప్పక మంచి విజయం అందుకుంటుందని అనుకున్నారు అంతా. అయితే చిత్రయానికి అనుకున్న రీతిలో టాక్ రాలేదని, పరిస్థితి చూస్తే బిలో యావరేజి చిత్రంగా మిగిలే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా చూస్తే గ్యాంగ్ డబ్బింగ్ చిత్రం కావడం, బాలకృష్ణ జయసింహ పర్వాలేదనిపించడం, అందునా మాస్ చిత్రం అవడం వల్ల బి, సి సెంటర్ లలో ప్రజలు ఎక్కువగా దానికే ఎగ పడుతున్నారని, ఏ సెంటర్లో ముందుగా గ్యాంగ్ కె ఓటేస్తున్నారంటున్నారు. పక్కాగా సంక్రాంతి విజేత అని చెప్పలేకపోయినా ఓవర్ అల్ గా చూస్తే జయసింహ కే కొంతమేర కలెక్షన్లు బాగున్నాయని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ సంక్రాంతికి మంచి బ్లాక్బస్టర్ విజయం అందుకున్న చిత్రమేదీ లేకపోవడంవల్ల ప్రేక్షకులు కొంత నిరాశపడ్డారని విశ్లేషకులు అంటున్నారు.