`ఆస్కార్‌` అందుకునే భార‌తీయ న‌టుడెవ‌రు?

Thursday, January 25th, 2018, 02:59:10 PM IST

ఆస్కార్స్ -2018 ఉత్స‌వాలు మార్చి 4న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల్లో సినిమా 24 శాఖ‌ల‌కు అవార్డుల్ని ప్ర‌క‌టిస్తారు. ఉత్త‌మ విదేశీ కేట‌గిరీలో భార‌తీయ సినిమాల‌కు ఆస్కారం ఉంది. అయితే .. అనూహ్యంగా రాజ్‌కుమార్ రావ్ న‌టించిన `న్యూట‌న్` సినిమా ఆస్కార్ నామినేష‌న్స్‌కు వెళుతుంద‌ని భావిస్తే, అనూహ్యంగా రేసు నుంచి త‌ప్పుకుంది. కానీ అలీ ఫ‌జ‌ల్ న‌టించిన `విక్టోరియా అండ్ అబ్ధుల్‌` రెండు నామినేష‌న్లు ద‌క్కించుకుంది. ఫేమ‌స్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ న‌టించిన `ది బిగ్ సిక్‌` చిత్రానికి ఆస్కారం ద‌క్కే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

విక్టోరియా అండ్ అబ్ధుల్ చిత్రం క్వీన్ విక్టోరియాకి, భార‌తీయుడైన ముస్లిమ్ సేవ‌కుడికి మ‌ధ్య అనుబంధం ఏంటి అన్న నేప‌థ్యంలో సాగే ఆస‌క్తిక‌ర చిత్రం. ఈ సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌, మేక‌ప్ & హెయిర్‌స్టైలింగ్ విభాగాల్లో ఆస్కార్‌లు అందుకునే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు. `ది బిగ్ సిక్‌` సినిమాకి ర‌చ‌న (ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే) విభాగంలో ఆస్కార్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా మ‌న ఇండియ‌న్లు ఆస్కార్ అందుకుంటే చూడాల‌ని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కేనో!!