అకిరా బర్త్ డే కి విష్ చేసిన మీ అందరికి థాంక్స్ : రేణు దేశాయ్

Sunday, April 8th, 2018, 05:46:45 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ నేడు బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులు అకీరాకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన కుమారుడికి పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ రావడం చూసిన రేణు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నా కుమారడిపై చూపిస్తున్న ఆదరాభిమానాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. తనకు ప్రస్తుతం 14ఏళ్లు వచ్చాయి, కాబట్టి తను టెక్నికల్‌గా బేబీ బోయ్ ఏమీ కాదు కానీ తనకు జన్మనిచ్చిన తల్లిగా నేను ఎప్పటికీ తనను చిన్నారిగానే భావిస్తాను. తల్లి, తండ్రి తరుపున గొప్ప వ్యక్తులున్న కుటుంబంలో అకీరా జన్మించాడు.

తను ఏ రంగాన్ని ఎంచుకున్నా మంచి సక్సెస్ సాధించాలని, ఎంచుకున్న రంగంలో తన ఫ్యామిలీ మెంబర్స్‌లాగే తనదైన ముద్ర వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు రాత్రి నుంచి చెబుతున్న బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్‌కి కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెబితే సరిపోదు. మీ అందరికీ నా లిటిల్ బర్త్ డే బోయ్ తరుఫున థాంక్యూ’’ అంటూ పోస్ట్ పెట్టి కుమారుడు అకీరాతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు రేణు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments