వీడియో : అదాశ‌ర్మ ఆ వేషాలేంట‌మ్మోవ్‌?

Monday, January 29th, 2018, 10:28:29 PM IST

ఎవ‌రైనా అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే కొంటె కుర్రాళ్లు వెంట‌ప‌డి మ‌రీ టీజ్ చేస్తారు కానీ, ఈవిడేంటి త‌నే కుర్రాళ్ల‌ వెంట‌ప‌డి మ‌రీ టీజ్ చేస్తోంది? అది కూడా అర‌వ తంబీల్ని అదే ప‌నిగా ఆడేసుకుంది. ఆడేసుకోవ‌డం అంటే అలా ఇలా కాదు.. ఓ రేంజులో.. ఇదిగో ఈ వీడియో చూశాక‌.. మీరే ఆ మాట చెబుతారు.

నేటివిటీ పిచ్చితో ఇంగ్లీష్ పీస్ నేర్చుకోలేని తంబీల్ని ఓ రేంజులోనే ఆడుకుంది అదాశ‌ర్మ‌. ఏ డైరెక్ట‌ర్ తంబీని ఇమ్మిటేట్ చేస్తోందో కానీ, మా గొప్ప‌గా అభిన‌యించింది. అర‌వ తంబీలే చూస్తే ఉరి వేసుకునేంత‌గా టీజ్ చేసింది. “ఛ‌.. వై దిస్ హీరోయిన్స్ న‌వ్ ఎ డేస్ డూయింగ్ స్కిన్ షో .. ఆల్ దిస్ ఆదాశ‌ర్మ .. ఎవ్రీ వ‌న్‌..వాటీజ్ ది రిక్వ‌యిర్‌మెంట్ ఆఫ్ ఆల్ దిస్‌.. ఫోక‌స్ యువ‌ర్ యాక్టింగ్ ట్యాలెంట్ ఫ‌స్టు.. వెరీ ఇంపోటెంట్‌.. ఊ..“ అంటూ అదా చాలా స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించింది ఈ వీడియోలో. కాస్తంత వ్యంగ్యం.. అవ‌హేళ‌న ఆ గొంతులో ధ్వ‌నించిన తీరు.. స్నాప్‌చాట్‌- ఫిల్ట‌ర్‌లో మార్ఫ్ చేసిన ఫేస్‌తో అబ్బో ఏముందిలే!! స‌హ‌జంగానే ముంబై నుంచి వ‌చ్చే ర‌బ్బ‌రు బొమ్మ‌ల‌కు న‌ట‌న రాద‌ని కామెంట్లు వినిపిస్తుంటాయి ఇండ‌స్ట్రీలో. తంబీలు అయితే మ‌రీ తిట్టేస్తారు. అలా త‌న‌ని ఎవ‌రు ఏడిపించారో కానీ, అత‌గాడిని మ‌న‌సులో పెట్టుకునే అదా ఈ ప‌ని చేసుంటుంది? ఇంగ్లీష్ పూర్తిగా రాకుండా అదా శ‌ర్మ‌తో ఎవ‌రైనా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తే ఇదిగో ఇలా ఆడుకుంటుందేమో?