పెళ్లి చేసుకుంటే తప్ప అఖిల్ స్టార్ అవ్వడా ?

Monday, November 21st, 2016, 05:19:50 PM IST

akhil1
స్టార్ కిడ్ హోదాలో సినీ పరిశ్రమ మొత్తం రెడ్ కార్పెట్ పరచగా వెండి తెర మీదికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. కథ దగ్గర్నుంచి దర్శకుడి వరకూ అన్నీ తన ఇష్ట ప్రకారమే కానిచ్చేశాడు. కానీ రావడమే వీర మాస్ హీరోగా సెటిలైపోవాలని అనుకున్న అతని ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో కాస్త జంకాడో ఏమో కానీ అబ్బాయి లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్నో లెక్కలు వేసుకుని, పెద్దవాళ్ళ క్లాసులు విని తరువాతి సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓకే చేసుకున్నాడు. అయితే అఖిల్ అందరికీ షాక్ ఇస్తూ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.

దీంతో అందరూ కెరీర్లో ఇంకా ఒక అడుగు కూడా వేయలేదు అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయాడే.. ఎందుకిప్పుడే పెళ్లి. అయినా నాగార్జున వాళ ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేస్తానన్నాడు కదా మరెందుకీ తొందర అనుకుని ముక్కున వేలేసుకున్నారు. కొందరైతే సినిమా వాళ్లకి జాతకాలంటే ఎక్కువ నమ్మకం కాబట్టి అఖిల్ జాతకంలో కూడా పెళ్ళైతే దశ తిరుగుతుందేమోనన్న అంశం ఉందేమోనని, అందుకే అఖిల్ పెళ్లికి తొందరపడుతున్నాడు కాబోలు అనుకుంటున్నారు. మరి ఈ మాట ఎంత శాతం నిజం ఎంత శాతం అబద్దం చెప్పడం కష్టమే.