అలీ ప‌వ‌న్ పేరు ఎందుకు ఎత్త‌డం లేదు!

Saturday, June 1st, 2019, 09:09:24 AM IST

క‌మెడియ‌న్ అలీకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. ప‌వ‌న్ సినిమాలో అలీ లేని సినిమాలు చాలా త‌క్కువే. అంత‌గా వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెన‌వేసుకుంది. అయితే తాజాగా వీరిమ‌ధ్య దూరం పెరుగూ వ‌చ్చింది. ఏపీ ఎన్నిక‌ల వేళ అలీ వైఎస్ ఆర్ సీపీ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన ప‌వ‌న్ అలీపై ఘాడుగానే స్పందించారు. త‌న‌కి ఎంతో చేశాన‌ని, అవ‌స‌రానికి ఆదుకున్నాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప‌వ‌న్ వెల్ల‌డించారు.

ఇది అలీని క‌లిచివేసింది. దీంతో ఓ వీడియోని విడుద‌ల చేశారు. ప‌వ‌న్ నా కంటే జూనియ‌ర్ అని, త‌ను సినిమాల్లోకి రాక‌ముందు నుంచే నేను చాలా బిజీ ఆర్టిస్టున‌ని, త‌న‌కు ఎవ‌రి స‌హాయం పొందాల్సిన అవ‌స‌రం ఇప్ప‌టికీ రాలేద‌ని, ఎదుటి వ్య‌క్తి ముందు చేయి చాచే అవ‌స‌రం వ‌స్తే ఆ రోజు అలీ ఈ లోకంలోనే వుండ‌డ‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత ఎన్నిక‌లు జ‌రిగిపోవ‌డం, ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ప‌వ‌న్ ఓట‌మిపాలు కావ‌డం అందిరికి తెలిసిందే. అయితే జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చిన అలీ ప‌వ‌న్ గురించి అడిగితే పారిపోతున్నాడ‌ట‌. జ‌గ‌న్‌ని పులివెందుల పులి బిడ్డ అని ఆకాశానికి ఎత్తేసిన అలీ త‌న స్నేహితుడు ప‌వ‌న్ ఓట‌మిపై స్పందించ‌మంటే ముఖం చాటేస్తూ పారిపోతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.