కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకిలా?

Saturday, May 30th, 2020, 07:06:29 AM IST

మన దేశంలో కరోనా ప్రవేశించిన్నప్పటి నుంచి మనవారి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయ పరంగా కాస్త భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలి.

ఎందుకంటే అటు తెలంగాణాలో కరొనను ఎదుర్కొనే సమయంలో కెసిఆర్ వహించిన పాత్ర హర్షణీయం కానీ వారు టెస్టుల లెక్కలను దాచి ఉంచడం ఆ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంపై అనుమానాలు రాక తప్పలేదు.

ఆ సమయంలో అక్కడితో పోలిస్తే గ్రాఫ్ పరంగా ఎంతో వెనుకబడి ఉన్న ఏపీ తర్వాత మాత్రం సరైన లెక్కలతో జిల్లాల వారీగా వివరించడం అంతే కాకుండా రికార్డు స్థాయి కేసులు టెస్ట్ చెయ్యడం జగన్ గ్రాఫ్ ను పెంచాయి.

కానీ గత రెండు వారాల నుంచి మాత్రం జిల్లాల వారీగా లెక్కలు చూపించకపోవడం పైగా మరింత ఆలస్యంగా లెక్కలు విడుదల చెయ్యడం అనుమానాలకు బలమైన అనుమానాలు పాతుతున్నాయి. ఇదే కనుక ఇక ముందు కూడా కంటిన్యూ అయితే జగన్ ప్రభుత్వానికే కాస్త నష్టం వాటిల్లుతుంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం సరైన వివరం ఇవ్వాల్సిందే.