చంద్రబాబు ఆక్రోశం ఎందుకో తెలుసా..?

Friday, August 23rd, 2019, 07:37:45 AM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా నిన్న ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తుంది. ప్రతిపక్షములో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నప్పుడు పక్క వాళ్ళని విమర్శంచాలి అంటే హుందాగా విమర్శించేవాడు. ఎప్పుడు కూడా నోరుజారి మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రజా వేదికల మీద కావచ్చు, మీడియా సమావేశంలో కావచ్చు, ఎప్పుడు కూడా చాలా బ్యాలన్సుడ్ గా కనిపించే బాబు నిన్న మాత్రం జగన్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు

పోలవరం విషయంలో హైకోర్టు వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ తీర్పు ఇవ్వటంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రెస్ మీట్ లతో కావచ్చు, డెబిట్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వైసీపీ ప్రభుత్వ పనితీరుని ఎండగడుతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఈ అంశం మీద స్పందించిన తీరే చర్చనీయాంశంగా మారింది. ‘పిచ్చా.. శని పట్టిందా.. మూర్ఖపు నిర్ణయం..’ అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించిన ప్రజలు జగన్ కి అఖండమైన మెజారిటీ ఇచ్చి సీఎంని చేశాడు. ఆ మెజారిటీ చూసి చంద్రబాబు నాయుడు కూడా అసూయా పడినట్లు తెలుస్తుంది. దీనితో నిన్న జరిగిన సంఘటనని లింక్ చేస్తూ ప్రజలు అంత గొప్ప మెజారిటీ ఇస్తే ఇలా పిచ్చి పట్టిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ బాబు మాట్లాడినట్లు సమాచారం.