ఇంతకీ ఎన్టీఆర్ టైటిల్ ఎందుకు మారిందబ్బా ?

Friday, October 5th, 2018, 12:15:05 AM IST


మహా నటుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం ఈ రోజు నుండి శ్రీకాకుళం లో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ సంఘటన ఈ రోజు జరిగింది. ఈ సినిమా టైటిల్ ఎందుకో మార్చేశారు ? తాజాగా బాలయ్య పోరానికం సినిమాకు సంబందించిన గెటప్ లో కత్తి పట్టి వీరుడిగా ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు . ఎన్టీఆర్ టైటిల్ కింద కథానాయకుడు అన్న ట్యాగ్ లైన్ తగిలించడంతో అందరు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ టైటిల్ ఎందుకు మారినట్టు ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రెండో పోస్టర్ లో ఎన్టీఆర్ పొలిటికల్ గెటప్ లో ఉన్న ఫొటోతో పాటు పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ కింద మహా నాయకుడు అంటూ టైటిల్ పెట్టారు .. అంటే ఇదివరకే వార్తలు వచ్చినట్టు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. అది సరే ఎన్టీఆర్ , ఎన్టీఆర్ 2 అని పెడితే సరిపోయేది కానీ దానికింద కథానాయకుడు, మహా నాయకుడు అన్న ట్యాగ్ లైన్స్ జోడించడం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే ఎన్టీఆర్ అన్న టైటిల్ ని వేరేవాళ్లు రిజిస్టర్ చేసారా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి భాగంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను వివరిస్తే .. రెండో భాగంలో అయన రాజకీయ ప్రస్థానాన్ని చూపిస్తారని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా నిర్మాతల విషయంలో కొద్దిగా తేడాలు ఉన్నట్టు ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ టైటిల్ మారిందని టాక్ !!