ఇంత జ‌రుగుతున్నా రేవంత్ స్పందించ‌డేంటి?

Sunday, June 9th, 2019, 02:30:50 PM IST

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి ఏమైంది?. ఎందుకీ మౌనం?. తెలంగాణ కాంగ్రెస్ ని తెరాస నిర్వీర్యం చేస్తున్నారేవంత్ ప‌ట్టించుకోవ‌డం లేదేంటి?. కాంగ్రెస్ సీఎల్పీని తెరాస‌లో విలీనం చేసినా రేవంత్ మీడియా ముందుకు రాలేదు. ఒక్క మాట మాట్లాడ‌లేదు. తెరాస అంటేనే ఒంటికాలిపై లేచే రేవంత్‌రెడ్డి త‌న పార్టీ నేత‌ల్ని క‌లుపుకుని సీఎల్పీని తెరాస బ‌ల‌వంతంగా విలీనం చేసుకున్నా నోరు విప్ప‌డం లేదు ఎందుకు? తెలంగాణ‌లో స‌గ‌టు వ్య‌క్తిని తొలుస్తున్న ప్ర‌శ్న‌లివి. నిత్యం ఫైర్ అయ్యే రేవంత్‌రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యాడు?. దీని వెన‌కున్న అస‌లు నిజ‌మేంట‌న్న‌ది ఎవ‌రీకీ అంతుప‌ట్ట‌డం లేదు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు, ఆ త‌రువాత కూడా తెరాస‌ను ఏకి పారేసిన రేవంత్ వున్న‌ట్టుండి సైలెంట్ కావ‌డానికి కార‌ణం వేరే వుంద‌ని తెలుస్తోంది. పార్టీలో రేవంత్ ప్రాధాన్యం ఎక్కువ‌వుతోంద‌ని సీనియ‌ర్లు మండిప‌డుతున్నార‌ట‌. ఆ కార‌ణంగానే రేవంత్ సైలెంట్ అయ్యార‌ని ఓ వ‌ర్గం చెబుతోంది. అయితే భ‌ట్టి విక్ర‌మార్క కాంగ్రెస్ సీఎల్పీ తెరాస‌లో విలీనం చేయ‌డాన్ని నిర‌సిస్తూ నిర‌స‌ర దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ దీక్ష‌కు రేవంత్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హాజ‌రు కాలేదు. దీంతో ఇద్ద‌రు క‌లిసి కొత్త‌గా పార్టీ పెట్టాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది.