జగన్ విషయంలో అసలు జేసీ ఇలా ఎందుకు చేసారు..?

Wednesday, June 5th, 2019, 02:19:05 PM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్లో ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డే అని అంటారు అందరు.అయితే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోగా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని బాంబు పేల్చారు.ఇదిలా ఉండాగా జేసీ ఏ స్థాయిలో మాట్లాడుతారో అందరికీ తెలుసు.అధికారంలో ఉన్న చంద్రబాబు మరియు అప్పుడు ప్రతిపక్షములో ఉన్న వై ఎస్ జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసారో కూడా అందరికీ తెలిసిందే..అప్పుడు జగన్ పై జేసీ చేసిన కామెంట్స్ అటు వైసీపీ శ్రేణుల్లోనూ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

కానీ ఎన్నికల్లో జగన్ మాత్రం అనూహ్యంగా గెలుపొందడంతో జేసీ తన ప్రవర్తన పూర్తిగా మార్చేశారు.ఒకప్పుడు జగన్ పై ఎలా నిప్పులు చెరిగారో ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు.ఇంకా చెప్పాలంటే జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.దీనితో జేసీలో ఇంత ఆకస్మిక మార్పుకు గల కారణం ఏమయివుంటుందా అంతా అనుకంటున్నారు.గతంలో ఒకసారి జగన్ కానీ ముఖ్యమంత్రి అయితే మొట్టమొదట నన్నే జైల్లో పెట్టేస్తారు అని అన్నారు.ఆ విషయంలోనే కాస్త సాఫ్ట్ కార్నర్ చేసేందుకు జగన్ ను ఇప్పటి నుంచే దువ్వుతున్నారా అని కొంత మంది వైసీపీ అభిమానుల్లో ఉంది.మొత్తానికి అసలు జేసీ ఇలా ఎందుకు చేశారా అన్నది ఓ ప్రశ్న గానే మిగిలింది.