నారా లోకేష్ ఆ నేతలకు దూరంగా ఉండటానికి కారణం ఏంటి…?

Tuesday, November 12th, 2019, 03:00:33 AM IST

ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల తరువాత అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారయిందని చెప్పాలి. దానికితోడు ఆ పార్టీ కి చెందిన కీలక నేతలు, పార్టీ అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీ లో బలమైన నాయకుడు లేడని, పార్టీని నడిపించడానికి బలమైన నాయకుడిని ఎంపిక చేయాలనీ దాదాపుగా చాలా రోజుల నుండి అందరు భావిస్తున్నారు. దానికి తోడు సీఎం జగన్ లని నాయకుడిని ఎదుర్కోవాలంటే మంచి నాయకుడు అవసరమని పార్టీ అధిష్టానం కూడా ఎప్పటినుండో భావిస్తుంది కూడా.

ఇకపోతే పార్టీ బాధ్యతలను శ్రీకాకుళ ఎంపీ రామ్మోహన్ నాయుడు కు అప్పగించాలి అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేసినప్పటికీ కూడా అందుకు నారాలోకేష్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే తనని కాదని పార్టీబాధ్యతలని వేరేవాళ్లకి అప్పగిస్తే తన పరువు పోతుందని, తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే ఆందోళన లోకేష్ లో వ్యక్తమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆలా చేస్తే పార్టీలో చీలికలు కూడా మొదలవుతాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రామ్మోహన్ తో పాటే బరిలో ఉన్న మరొక నేత గల్లా జయదేవ్. ఈయన కూడా మంచి వాక్చాతుర్యం కలిగిన నేత. పార్టీని నడిపించగల సత్తా ఉన్న మంచి దమ్మున్న నేత. ఈ విషయంలో కూడా నారాలోకేష్ బెట్టు చేస్తున్నాడు. తనని కాదని పార్టీ పగ్గాలు వేరేవాళ్లకి అప్పగిస్తే చీలికలు వచ్చి చివరికి నారాలోకేష్ ఒక కార్యకర్త గా మిగిలిపోవాల్సి వస్తుందన్న భయంతో ఆ ఇద్దరు నేతలకు నారాలోకేష్ దూరంగా ఉంటున్నారని సమాచారం.