అక్క‌ర్లేక‌పోయినా ఆప‌రేష‌న్స్.. అదీ కార్పొరెట్ ఆస్ప‌త్రుల స్టైల్‌!!

Friday, February 17th, 2017, 01:12:14 PM IST


బీవేర్ ఆఫ్ కార్పొరెట్‌!! ముఖ్య ంగా కార్పొరెట్ ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయితే జాగ్ర‌త్త‌!! అక్క‌డ ఏదైనా స‌ర్జ‌రీ చేయాల‌ని అన‌వ‌స‌రంగా కంగారు పెట్టేస్తున్నారంటే ప‌దే ప‌దే ఆలోచించండి. అస‌లు అంత‌గా కంగారు పెట్టేయాల్సినంత ఉందా? అన్న విచ‌క్ష‌ణా జ్ఞానాన్ని ప్ర‌దర్శించండి. వెంట‌నే స‌ర్జ‌రీకి ఓకే చెప్పేయ‌కుండా కాస్త టైమ్ తీసుకోండి. అప్ప‌టికి స‌ద‌రు ఆస్ప‌త్రి నుంచి బ‌య‌ట‌ప‌డండి. త‌ర్వాత సంబంధిత డాక్యుమెంట్ల‌తో వెళ్లి సెకండ్‌ ఒపీనియ‌న్ తీసుకోండి. సీరియ‌స్‌, సివిలియ‌ర్ అన ద‌గ్గ కేసుల్లో ఏమీ చేయ‌లేరు. క‌నీసం కంగారు లేని వాటికీ కంగారు పెట్టేసే బాప‌తులు కార్పొరెట్ ఆస్ప‌త్రుల్లో ఉంటున్నారు.

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో కొన్ని క్యాట‌రాక్ట్ ఆప‌రేష‌న్స్‌.. అవి కూడా రిస్కీ ప్రీమాచుర్ కాట‌రాక్ట్ (కంటి ఆప‌రేష‌న్లు) ఆప‌రేష‌న్లు అవ‌స‌రం లేక‌పోయినా చేస్తున్నార‌న్న నిందారోప‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటివి చారిటీ ఆస్ప‌త్రుల్లో ఉండ‌నే ఉండ‌వు. కానీ కార్పొరెట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లిన‌ప్పుడే ఎదుర‌వుతున్నాయి. అంతేకాదు.. పేషెంట్ స్వ‌యంగా డాక్ట‌ర్ల‌పై ్ఒత్తిడి తెచ్చి.. “డాక్ట‌ర్ డ‌బ్బు ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు. ఆప‌రేష‌న్ చేసేయండి“ అంటున్న సంద‌ర్భాల్లోనూ డాక్ట‌ర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా నా ద‌గ్గ‌ర ఇన్సూరెన్స్ కార్డ్ ఉందిగా! అని ముందే క్లూ ఇచ్చారో మీకు స‌ర్జ‌రీ ప‌డుద్ది! అవ‌స‌రం ఉన్నా.. లేక‌పోయినా.. ! అయితే డాక్ట‌ర్లు మ‌రీ ఇంత క‌క్కుర్తి ఎందుకు ప‌డుతున్నారు? అని ఆరాతీస్తే.. అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. ఒక్కో కార్పొరెట్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్‌కు 1.5ల‌క్షల శాల‌రీ ఇస్తున్న‌ప్పుడు ఒక్కో డాక్ట‌రు నుంచి ఎంత సంపాదించాలి. అందుకు మ‌రో రెండింత‌లు అద‌నంగా వ‌సూలు చేయాలి క‌దా! ఆ మొత్తాన్ని డాక్ట‌ర్ల‌కు టార్గెట్‌గా ఇస్తోంది. అంటే ల‌క్ష‌న్న‌ర‌కు మ‌రో మూడు ల‌క్ష‌లు క‌లిపి నెల‌కు 4.5ల‌క్ష‌లు ఒక్కో డాక్ట‌రు సంపాదించి పెట్టాల‌న్న‌మాట‌!

అంటే అంత పెద్ద మొత్తం తేవాలంటే నెల‌కు క‌నీసం 25 స‌ర్జ‌రీలు అయినా చేయాలి. చిన్నా చిత‌కా, సీరియ‌స్ అన్నీ క‌లిపితేనే అన్ని చేయ‌గ‌ల‌రు. అలా ప్ర‌తి డాక్ట‌రుకి టార్గెట్లు ఉంటాయి. ఇదో నిరంత‌ర ప్ర‌క్రియ‌. ఇప్పుడ‌ర్థ‌మైందా కార్పొరెట్ ఆస్ప‌త్రుల అస‌లు లోగుట్టు. ఇదివర‌కు ఆరోగ్య‌శ్రీ పేరుతో వ‌చ్చే ఆదాయం కోసం అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేసుకుని డ‌బ్బు దండుకునేవారు. ప్ర‌తి స‌న్నివేశంలోనూ దోచేయ‌డ‌మే ఈ కార్పొరెట్ ప‌ని.