ఆడవాళ్లే ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు ? తెలిసిపోయింది..!

Friday, December 29th, 2017, 09:30:55 PM IST

ఈ విషయం సాధారణంగా అందరూ గమనించేదే. మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఏడుస్తుంటారు. ఏదైనా కష్టం వచ్చిందంటే ఆడవారిని సముదాయించడం చాల కష్టం. మగవారిలో కంటే ఆడవారిలో భావానియంత్రణ తక్కువగా ఉంటుంది. దీనిపై స్విట్జర్లాండ్ లోని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసారు. బెస్సెల్ యూనివర్సిటీలో దీనిపై రీసెర్చ్ జరిగింది.

మగవారి కంటే ఆడవారు ఎక్కువగా ఏడవడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. స్త్రీల మరియు పురుషుల మెదడులలో ఆకృతులు వేరని తెలిపారు. పురుషులలో భావ నియంత్రణకు అవసరమైన భాగం మెదడులో 19 శాతం వరకు ఉంటుంది. కానీ స్త్రీల విషయానికి వస్తే ఆ శాతం చాలా తక్కువని అంటున్నారు. అందుకే స్త్రీలు ఏదైనా భాద కలిగినప్పుడు వేంటనే ఏడ్చేస్తారని వెల్లడించారు.