అడ్డంగా బుక్కైన స్టార్ హీరో మహేష్ బాబు

Thursday, January 26th, 2017, 03:11:44 PM IST

mahesh
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే స్టార్ హీరో మహేష్ బాబు ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు జల్లికట్టు కోసం ప్రజల ఉద్యమానికి మద్దతు తెలిపిన మహేష్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి ఉద్యమం వస్తుందని ఊహించి ఉండడు. ఎప్పుడూ ఎక్కడ వివాదాలు జరిగిన ఒక కామెంట్ కూడా చేయని మహేష్ జల్లికట్టు ఫై కామెంట్ చేసాడు. అతను తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తమిళ్ లో కూడా విడుదల కానుండడంతో అక్కడ పబ్లిసిటీ కోసం మహేష్ జల్లికట్టును సమర్థిస్తూ ట్వీట్ చేసాడు.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఇలాంటి ఉద్యమమే వచ్చింది. దీనిపై తెలుగు యువ హీరోలు చాలా మంది ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేసారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. దీనిపై ఆయన అభిమానులు రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. తన సినిమా తమిళం లోకి డబ్ చేయడానికి అక్కడ ప్రజలకు మద్దతు ఇచ్చారు కానీ తనను సూపర్ స్టార్ ని చేసిన తెలుగు ప్రజల సంతోషం ఆయనకు అక్కర్లేదా…? అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ పాపం జల్లికట్టుకు మద్దతిచ్చి ఆంధ్రప్రదేశ్ జనాలకు అడ్డంగా బుక్కయిపోయాడు. మరి మహేష్ దీనికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.