జూపూడి విషయంలో వైసీపీ మీడియాకి ఉలుకెందుకు..?

Wednesday, October 9th, 2019, 05:31:37 PM IST

ఆంధ్రాలో వైసీపీ పార్టీ వలసల విషయంలో స్పీడ్ పెంచింది. అధికారంలోకి వచ్చిన మొదటి నాలుగు నెలలు పరిపాలన విషయంలో, జగన్ చెప్పిన హామీల విషయంలో దృష్టి సారించిన వైసీపీ పార్టీ, ఈ మధ్య ఇతర పార్టీల నుండి వైసీపీ లోకి వచ్చేవారిని చేర్చుకునే పనిలో పడింది. అయితే ఎందరు నేతలు వైసీపీ లో చేరిన కానీ ఆ పార్టీ అనుకూల మీడియా వాటికీ బాగానే కవరేజ్ ఇచ్చింది, కానీ తాజాగా వైసీపీ పార్టీలోకి తిరిగి వచ్చిన జూపూడి ప్రభాకర్ విషయంలో మాత్రం వైసీపీ అనుకూల మీడియా మొదటి నుండి వ్యతిరేకంగానే ఉంటుంది.

జూపూడి లాంటి అవకాశవాదిని తిరిగి ఎందుకు పార్టీలోకి తీసుకోవటం, అతని తిరిగి పార్టీలోకి తీసుకోవటం వలన క్యాడర్ కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. జూపూడి ఒక అర్భక రాజకీయ నేత, ఒక రాజకీయ నేతకు ఉండవలసిన లక్షణాలు ఒకటి కూడా అతనికి లేవు, కులం కార్డు ఉపయీగించుకొని రాజకీయాలు చేస్తుంటాడంటూ జూపూడి మీద విషం కక్కుతున్నాయి. ఎంత మంది నేతలు తిరిగి వైసీపీలోకి చేరిన కానీ పల్లెత్తు మాట మాట్లాకుండా వుండిపోయిన వైసీపీ అనుకూలం మీడియా కేవలం జూపూడి విషయంలో ఇంత దారుణంగా ఆరోపణలు చేయటం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.