`కాలా` నైజాం ఎందుకు కొన‌లేదు?

Friday, May 25th, 2018, 10:25:55 AM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ నిర్మించిన `కాలా` జూన్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే త‌మిళ‌నాట ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. ఈనెల 29న హైద‌రాబాద్‌లో తెలుగు వెర్ష‌న్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే కాలా తెలుగు రాష్ట్రాల బిజినెస్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ర‌జ‌నీ వ‌రుస ప‌రాజ‌యాల ట్రాక్ రికార్డు కాలా బిజినెస్‌పై ప‌డింది. దానికి తోడు నిర్మాత ధ‌నుష్ ఏకంగా ఇరు రాష్ట్రాల హ‌క్కుల‌కు 40కోట్ల మేర కోట్ చేయ‌డంతో బ‌య్య‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఆంధ్రా, సీడెడ్ బిజినెస్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఫ్యాన్సీ ధ‌ర చెల్లించి కొనుగోలు చేశార‌ట‌. సుమారు 20కోట్ల మేర ఈ డీల్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే ఓవ‌రాల్‌గా 40కోట్లు డిమాండ్ చేసిన నిర్మాత ధ‌నుష్ .. ఇంకా నైజాం హ‌క్కులు అమ్మ‌కాలు సాగించ‌లేదు. అయితే దిల్‌రాజు, సుధాక‌ర్ రెడ్డి వంటి టాప్ డిస్ట్రిబ్యూట‌ర్లు ర‌జ‌నీకాంత్ సినిమాపై న‌మ్మ‌కం లేకే కొన‌లేదా? అంటూ ఒక‌టే ఫిలింన‌గ‌ర్‌లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌నీసం డి.సురేష్‌బాబు అయినా ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వేళ ఈ డీల్ పూర్తి చేసేందుకు సాయం చేయొచ్చు క‌దా.. అంటూ మాట్లాడుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments