బ‌న్నితో మినీ దాస‌రి సినిమా ఏమైంది?!

Monday, July 30th, 2018, 01:45:17 PM IST

న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్లో ఇలా ఓ హిట్టు కొట్ట‌గానే వెంట‌నే స్టార్ హీరోల‌కు క‌థ‌లు వినిపించేస్తున్నారు. కెరీర్ ప‌రంగా జెట్‌స్పీడ్‌తో టేకాఫ్ చేయాల‌న్న ఆత్ర‌మే అది. అయితే అలాంటి ఆత్ర‌మేదీ త‌న‌కు లేనేలేద‌ని మెగా యువ‌డైరెక్ట‌ర్ మారుతి చెప్ప‌క‌నే చెప్పాడు. మారుతికి చాలా కాలం క్రిత‌మే క‌థ రెడీ చేసుకోవాల్సిందిగా బ‌న్ని ఆఫ‌ర్ చేశాడు. అల్లు శిరీష్‌ని డైరెక్ట్ చేసిన మారుతి ఇక జాక్‌పాట్ కొట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. కానీ అచ్చులో బొమ్మ తిర‌గ‌బ‌డింది ఇక్క‌డే!

అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని “మారుతి దాస‌రి“ ఆవేశ‌ప‌డ‌లేదు. త‌న‌దైన శైలిలో బుర్ర‌కు ప‌దునుపెట్టాడు. స్టార్‌హీరోల‌తో సినిమాలు తీయ‌డం త‌న ల‌క్ష్యం కాదు. ప‌దేళ్ల పాటు ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగ‌డం ఒక్క‌టే త‌న ఎజెండాగా పెట్టుకుని అందుకు త‌గ్గ‌ట్టే స్క్రిప్టులు రాసుకుని కాన్సెప్టుకు సూట‌య్యే హీరోల్ని ఎంచుకుని తెలివైన గేమ్‌ని ప్లాన్ చేశాడు. ఈ గేమ్‌ప్లాన్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. మారుతి ప‌రిశ్ర‌మ‌లో మ‌రో మినీ దాస‌రిగా అవ‌త‌రించ‌డంలో ఈ గేమ్‌ప్లాన్ వాహ్వా అనిపించేలా వ‌ర్క‌వుటైంద‌నే చెప్పాలి. ఇక‌పోతే స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేయ‌రా? అని బ్రాండ్ బాబు ఇంట‌ర్వ్యూలో మారుతినే అడిగితే షాకిచ్చే ఆన్స‌రే ఇచ్చాడు. ప‌దేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఉండ‌నివ్వండి ప్లీజ్‌! అన్న‌ట్టే మాట్లాడాడు. నా కాన్సెప్టులే హీరోల్ని డిసైడ్ చేస్తున్నాయి. అలాంట‌ప్పుడు స్టార్ హీరోల కోసం ఏం పాకులాడ‌తాను.

నేను సేఫ్‌జోన్‌లోనే వెళుతున్నా… అని సూటిగా చెప్పేశాడు. అన్న‌ట్టు.. ఇండ‌స్ట్రీలో తాను ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా సాగేది కొంద‌రికే. ఆ కంఫ‌ర్ట్‌జోన్ ఉంది కాబ‌ట్టే మారుతి స్టార్ హీరోల జోలికి వెళ్ల‌కుండా సినిమాలు తీసుకుంటూ వెళుతున్నాడు. ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తూనే, ర‌చ‌యిత‌గా స్క్రిప్టులు రాసుకుంటూ, నిర్మాత‌గా వేరే ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ తెలివైన ఆట ఆడుతున్నాడు. దాస‌రి ఇంటిపేరా మ‌జాకానా? ద‌ట్సిట్‌!!

  •  
  •  
  •  
  •  

Comments