మాస్‌రాజాకు మెగాస్టార్ సీక్రెట్ కాల్‌?

Monday, April 16th, 2018, 09:56:31 PM IST


మెగాస్టార్ చిరంజీవి మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు సీక్రెట్ కాల్ చేశారు. కాస్త నీతో మాట్లాడాలి.. అని అడిగారు! అయితే అంత సీక్రెట్ ఏం ఉంది? అంటారా .. ఈ క్ష‌ణం ఇదో స‌స్పెన్స్. భ‌విష్య‌త్‌లో ఆ కాల్ దేనికైనా దారి తీయొచ్చు.. బ‌హుశా చిరంజీవి- ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ అయ్యి ఉండొచ్చు క‌దా? .. ప్ర‌స్తుతం కొణిదెల కాంపౌండ్‌లో సాగుతున్న సీక్రెట్ టాక్ ఇది.

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి ఎందుక‌నో మాస్‌రాజాకు కాల్ చేయ‌డంతో ఒక‌టే గుస‌గుస‌లు న‌డిచిపోతున్నాయి. సైరా – న‌ర‌సింహారెడ్డి ఇలా పూర్త‌వ్వ‌గానే, సుకుమార్‌తో సినిమాకి స‌న్నాహాలు మొద‌లవుతాయి. ఆ సినిమా కోస‌మే ర‌వితేజ‌కు చిరు కాల్ చేశార‌ని చెప్పుకుంటున్నారు. సుక్కూ రాసుకున్న మూడు క‌థ‌ల్లో మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌తో ఉన్న ఓ క‌థ‌ని చిరు లాక్ చేసేశారు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు క‌న్ఫామ్ అయిపోయింద‌ని చెబుతున్నారు. మ‌హేష్‌తో సినిమా పూర్తి చేసుకుని, త‌దుప‌రి చిరు కోసం పూర్తిగా స‌న్న‌ద్ధ‌మ‌వుతాడు సుకుమార్‌. అప్ప‌టికి సైరా పూర్తి చేసుకుని చిరు కూడా క్యూలోకొస్తార‌ని చెబుతున్నారు. 2019లో మొద‌లెట్టి, 2020లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. సుక్కూ కూడా చిరుతో ప్రాజెక్టును ఇదివ‌ర‌కూ క‌న్ఫామ్ చేసిన సంగ‌తి తెలిసిందే.