భరత్ ఆడియో వేడుకలో ప్రకాష్ రాజ్ కు ఎందుకు కోపం వచ్చింది?

Sunday, April 8th, 2018, 03:43:08 PM IST

నిన్న జరిగిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అతిరధ మహారథుల సమక్షంలో, ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఇదే వేడుకలో చోటు చేసుకున్న ఓ అనూహ్య పరిణామం కూడా ఇంతే చర్చనీయాంశం అయింది. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన ప్రకాష్ రాజ్ మనస్తాపం చెంది అర్ధంతరంగా తన ప్రసంగాన్ని ఆపేసి వేదిక దిగి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆయన వెళ్లిపోవడానికి దారి తీసిన కారణంఏంటి అంటే, ఆయన మాట్లాడుతుండగా, మధ్యలో కొందరు అభిమానులు ‘ఫాదర్ ఫాదర్’ అంటూ నినాదాలు చేయసాగారు.

ఆయన తన ప్రసంగం ఆపేసి నవ్వుతూనే ఏంటి ఏంటి అని ఆ నినాదాలు చేసిన వాళ్ల వైపు చూశారు. వాళ్లు మళ్లీ ‘ఫాదర్ ఫాదర్’ అన్నారు. వేదిక మీద ఉన్న వాళ్లు ప్రకాష్ రాజ్ కు విషయం చెప్పారు. అంతే, ఆయన హఠాత్తుగా తన ప్రసంగాన్ని ఆపేసి వేదిక దిగిపోయారు. యాంకర్ సుమ ఈ విషయాన్ని కవర్ చేస్తూ ఆయన్ని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఐతే ఇలాంటి వేడుకల్లో వేదిక మీద వక్తలు మాట్లాడుతున్నపుడు అభిమానులు ఏవో నినాదాలు చేయడం మామూలే. ఎక్కువగా ఫాదర్ క్యారెక్టర్లు చేస్తుంటారు కాబట్టి వాళ్లు అలా అన్నారేమో.

అయినా దానికి పెద్దగా ఫీలవ్వాల్సిందేముంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంత మంది జనాలు వచ్చినపుడు వాళ్లను కంట్రోల్ చేయడం కష్టమే. వాళ్ల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా హర్టయిపోయి వేదిక విడిచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదనేది కొందరి వాదన. ఈ మధ్య రాజకీయాలపై చాలా ఘాటుగా స్పందిస్తున్న ప్రకాష్ రాజ్ లో అసహనం బాగా పెరిగిపోయిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది…..

  •  
  •  
  •  
  •  

Comments