ఆస్కార్ కి ప్రియాంకా డుంకీ కొట్టింది…ఎందుకు..?

Monday, March 5th, 2018, 12:56:49 PM IST

ఇండియన్ ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఓ అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకుంది. చాలా రోజులుగా బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి.. హాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ మాజీ మిస్ వరల్డ్.. 90వ అకాడమీ ఆస్కార్ అవార్డ్స్ సెర్మనీలో అవార్డులు అందజేయడానికి భారత్ తరపున రావాల్సి ఉంది. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె సెర్మనీకి రాలేకపోయింది. ఈ విషయాన్ని ప్రియాంకే తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. అసలు లేవడానికి కుడా ఓపిక లేదని, అనారోగ్య స్థితిలో రాలేని పరిస్థితుల్లో ఉన్నానని, నామినేట్ అయిన వాళ్లందరికీ నా తరుపునుంచి ఆల్ ద బెస్ట్ అని పోస్ట్ చేసింది. క్వాంటికో టెలివిజన్ సిరీస్‌తో ప్రియాంకా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈసారి విజేతలకు అవార్డులను అందించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఈసారి కూడా జిమ్మి కిమ్మెల్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్ చేశాడు. ఈసారి బెస్ట్ మూవీగా షేప్ ఆఫ్ వాటర్, గుల్లెర్మో డెల్ టొరో బెస్ట్ డైరెక్టర్‌గా, డార్కెస్ట్ హవర్‌లో తన నటనతో ఇరగదీసిన గ్యారీ ఓల్డ్‌మ్యాన్ బెస్ట్ యాక్టర్‌గా నిలిచి అవార్డులను కైవసం చేస్కున్నారు.