మెగాబ్ర‌ద‌ర్‌ అభిమానించిన హీరో చివ‌ర‌కిలా?!

Wednesday, April 18th, 2018, 01:18:50 PM IST

బోయ్స్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, బొమ్మ‌రిల్లు .. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్లు. ఇటీవ‌లే `గృహం` అనే హారర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని, ఆ సినిమా త‌మిళ‌వెర్ష‌న్ `అవ‌ల్‌`తో తంబీల్ని ఆక‌ట్టుకున్నాడు. కుటుంబ స‌మేతంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో కూచుని సిద్ధార్థ్ సినిమాల్ని ఆస్వాధిస్తారు. అలాంటి క్లాసిక్ సినిమాల్లో న‌టించిన హీరోగా అత‌డు ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో స్థిరంగా ఉన్నాడు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అంత‌టి వారే సిద్ధార్థ్‌కి వీరాభిమానిన‌ని ప్ర‌క‌టించారు. ఇంకా ఆ కాంపౌండ్‌లో ఎంద‌రో సిద్ధార్థ్‌ని అభిమానిస్తారు. అలాంటి మేటి హీరో గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా స్ట్ర‌గుల్స్ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే.

సిద్ధార్థ్ త‌మిళంలో సాఫీగానే కెరీర్ బండి న‌డిపిస్తున్నా, తెలుగులో మాత్రం పూర్తిగా డీలా ప‌డిపోయాడ‌నే చెప్పాలి. అయితే ప్ర‌తిభావంతుడిని ఎక్కువ కాలం దాచ‌లేం. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే! ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక రోజొస్తుంది. ఆ రోజుకోస‌మే సిద్ధూ కూడా వేచి చూస్తున్నాడు. మ‌రోవైపు అత‌డు హిందీ, మ‌ల‌యాళంలోనూ ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఇటీవ‌లే మ‌ల‌యాళ చిత్రం `క‌మ్మ‌రసంభ‌వం`లో న‌టించాడు. మ‌ల‌యాళ ఎంట్రీ మూవీలో సిద్ధార్థ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నిన్న‌టిరోజు సిద్ధార్థ్ బ‌ర్త్‌డే అయినా తెలుగుమీడియా అంత‌గా ప‌ట్టించుకున్న‌దే లేదు. తెలుగునాట పెద్దంత‌ హ‌డావుడి లేక‌పోయినా.. త‌మిళ అభిమానులు మాత్రం పార్టీలు చేసుకున్నారు. అయితే ఎక్క‌డైనా ప్ర‌తిభే గెలుస్తుంది.. కాబ‌ట్టి సిద్ధార్థ్‌కి తెలుగులో మ‌రోసారి దూసుకొచ్చే ఛాన్స్ పుష్క‌లంగా ఉంది. కాస్త వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments