ఆ డేట్ కోసం ఎందుకంత పోటీ : సూపర్ స్టార్ vs సూపర్ స్టార్

Monday, February 12th, 2018, 11:42:28 AM IST

తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ నూతన చిత్రం 2.0 పై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందని చెపుతున్న ఆ చిత్ర దర్శకుడు శంకర్, చిత్రం లో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యత ఉండడంతో సిజి వర్క్ కే ఎక్కువ సమయం కావలసి ఉండడం వల్ల విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఆయన ఇదివరకు చెప్పడం విన్నాం. అయితే ఇప్పటికీ విడుదల తేదీ మీద ఏమాత్రం క్లారిటీ లేదని తేలుతోంది. దాంతో ఎప్పటినుండో రజని సినిమా తేదీ ప్రకటిస్తే తమ సినిమాలు విడుదల చేయొచ్చని భావిస్తున్నారు బన్నీ, మహేష్.

అయితే హఠాత్తుగా రజని నటిస్తున్న మరొక చిత్రం ‘కాలా’ ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 27న విడుదలవుతున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఇదే ఆ చిత్రాల నిర్మాతలను అయోమయంలో పదిసినట్లయిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు అందరూ కూడా 2.0 కాస్త పోస్టుపోన్ అవుతుందని అందువల్ల మన ఈ ఇద్దరు హీరోలు రెండువారాల గాప్ తో తమ చిత్రాలు విడుదల చేయవచ్చని భావించారు. ఉన్నట్లుండి కాలా నిర్మాతల ప్రకటనతో వీరిద్దరి చిత్రాల విడుదల కొంత చిక్కుల్లో పడేసిందని అంటున్నారు. అయితే బన్నీ నా పేరు సూర్య మాత్రం ఏప్రిల్ 14 న రానుందని సమాచారం.

కాగా ఒక ఆసక్తికర ఈ విషయమై ఒక వార్త ప్రస్తుతం నెట్లో సంచలనం రేపుతోంది. అదేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 27న విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత దానయ్య భావిస్తున్నట్లు వార్త అందుతోంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదుకాని, ఒక వేళ అదే జరిగితే రజనికాంత్ వర్సెస్ మహేష్ బాబు అవుతుందని, అయితే అలాంటి పరిస్థితుల్లో ఇద్దరికీ కొంతమేర థియేటర్ ల కొరత సమస్య రాక తప్పదని తెలుస్తోంది. అసలే వేసవి సెలవలు కావడంతో ఆ సమయంలో విడుదల చేస్తే సినిమాకు ఏమాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని ఇరుచిత్రాల నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ చిత్రం విషయమై మాత్రం యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వున్నది….