ప్ర‌భుత్వ స‌న్మానం: ఇంత‌కీ ఏం సాధించింద‌ని?

Tuesday, March 6th, 2018, 08:37:35 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం విడ్డూరం చూశారా? మార్చి 8న మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప‌లువురు మ‌హిళా సెల‌బ్రిటీల్ని స‌న్మానించి, పుర‌స్కారాలు అందించేందుకు టీ-ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందుకు ఓ భారీ వేదిక‌ను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఉత్స‌వాల్లో వివిధ రంగాల‌కు చెందిన 20 మంది ప్ర‌తిభావంతులైన‌ లేడీస్‌కి అవార్డులిచ్చి స‌న్మానిస్తుందిట‌. ప‌లు రంగాల్లో రాణించిన గొప్ప మ‌హిళ‌ల‌కు ఇలాంటివి ఇవ్వ‌డం మామూలే కానీ, సినిమా రంగం నుంచి డైరెక్ట‌ర్‌ నందిని రెడ్డిని పిలిచి అవార్డు ఇవ్వ‌డ‌మేంటో అర్థంగాక జ‌నం బుర్ర‌లు గోక్కుంటున్నారు.

చేసిన‌వి మూడు నాలుగు సినిమాలు. అందులో `అలా మొద‌లైంది` ఒక్క‌టే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. మిగ‌తా సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లు. పైగా కాపీ క్యాట్ అంటూ దుమ్మెత్తిపోసిన‌వే. దీంతో ఆల్మోస్ట్ స‌ద‌రు మ‌హిళా ద‌ర్శ‌కురాలి కెరీర్ అంప‌శ‌య్య‌పైనే ఉంది. ఇలాంటి ద‌ర్శ‌కురాలిని పిలిచి టీ-ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స‌న్మానించ‌డమేంటా? అంటూ న‌వ్వుకుంటున్నారు. అయితే తెలంగాణ‌లో ఉన్న ద‌ర్శ‌కురాలు తాను మాత్ర‌మే కాబ‌ట్టి ఇలా స‌న్మానానికి పిలుస్తున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మ‌రి దీనికి టీ-ప్ర‌భుత్వాధీశులు ఏం క‌వ‌రింగ్ ఇస్తారో?