విజయసాయి రెడ్డి అతనిపై ఒక్క ట్వీట్ కూడా పెట్టరెందుకు.!

Sunday, July 12th, 2020, 09:05:44 AM IST

ప్రస్తుతం ఏపీ లో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో అంతర్గత కలహాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారం చేపట్టకపోయే సరికి చాలా మందే ఆ పార్టీను వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడున్న నేతల్లో కూడా చాలా మందే పార్టీ పని తీరుపై అసంతృప్తి గానే ఉన్నారు.

అయితే వీరి సంగతి పక్కన పెడితే వైసీపీలో కూడా అసంతృప్తి సెగలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ వారిని మాత్రం వైసీపీ హైలైట్ చెయ్యడం లేదు.వారిలో ముఖ్యంగా వైసీపి ఎంపీ రఘురామ కృష్ణం రాజు మ్యాటర్ ను సున్నితంగానే సెటిల్ చేద్ధాం అనుకున్నా అది కాస్తా పెద్ద సంచలనం రేపింది.

అయితే అన్ని కీలక అంశాలపై తన ట్విట్టర్ పిట్ట ద్వారా సంచలనం రేపే విజయసాయి రెడ్డి ఈ ఇస్యుపై మాత్రం ఎందుకో స్పందించడం లేదు. దీనితో వీరి పార్టీకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారో వారిని చెండాడే వీసా రెడ్డి ఈ ఇష్యూపై ఎందుకు ఒక్క ట్వీట్ కూడా వెయ్యడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.