స‌ల్మాన్‌ని అవ‌మానించిన టీమిండియా కెప్టెన్‌?

Saturday, January 20th, 2018, 12:54:56 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ అందాల నాయిక అనుష్క శ‌ర్మ‌ను మ‌నువాడిన సంగ‌తి తెలిసిందే. విరుష్క జంట గ‌త నెల‌రోజులుగా నిరంత‌రం వార్త‌ల్లో నిలిచారు. ఈ జంట వివాహానంత‌ర విందు కార్య‌క్ర‌మాలు ఎంతో ఆస‌క్తి రేకెత్తించాయి. ఇక కొత్త కాపురం పెట్టాక‌.. ప్ర‌స్తుతం ఎవ‌రి కెరీర్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. విరాట్ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు. టెస్టుల్లో వ‌రుస ఓట‌ముల‌తో చికాకుల్లో ఉన్నాడు. అనుష్క శ‌ర్మ త‌ను న‌టించిన హార‌ర్ సినిమా రిలీజ్‌కి స‌న్నాహాలు చేసుకుంటోంది.

ఇటీవ‌లే అందాల క‌థానాయిక‌ అనుష్క శ‌ర్మ‌ను పెళ్లాడి సంసార బంధ‌నంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికాలో టెస్ట్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అక్క‌డ వ‌రుస వైఫ‌ల్యాలు విరాట్‌ని చికాకుపెడుతున్నాయి. ఆ క్ర‌మంలోనే మొన్న‌టికి మొన్న ఓ ఫోటోని సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసి, కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశాడు.

బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్‌, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, గాయ‌కుడు హ‌నీసింగ్ ఫోటోల్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన విరాట్ .. ఆ ఫోటోల‌కు ఆస‌క్తిక‌ర కామెంట్‌ని జోడించాడు. “వీళ్ల‌కు ఇండియా బ‌య‌ట‌ గౌర‌వం లేదు..! నా ఉద్ధేశ‌మేంటో అర్థ‌మైందా?“ అంటూ కామెంట్ చేశాడు. ఈ ప్ర‌శ్న‌లో లాజిక్ ఏంటో కొంద‌రికే అర్థ‌మైంది. అయితే ఎక్కువ‌మంది మాత్రం వేరేగా ఊహిస్తున్నారు. అనుష్క శ‌ర్మ కు స‌ల్మాన్ బ‌ద్ధ విరోధి. ఓసారి సెట్లో స‌ల్మాన్ త‌న‌పై పిచ్చిగా అరిచి కొట్టినంత ప‌ని చేశాడుట‌. దాంతో నాటి నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌! అందుకే ఇన్నేళ్ల కెరీర్‌లో సల్మాన్ భాయ్ స‌ర‌స‌న అనుష్క శ‌ర్మ న‌టించ‌లేదు. మొన్న విరుష్క పెళ్లికి కానీ, రిసెప్ష‌న్‌కి కానీ ఊరంతా వ‌చ్చింది కానీ, స‌ల్మాన్ మాత్రం రాలేదు. అస‌లు అనుష్క శ‌ర్మ స‌ల్మాన్‌ని పిల‌వ‌నేలేద‌ని చ‌ర్చ సాగింది. మొత్తానికి ఇలా ఊరి బ‌య‌ట స‌ల్మాన్‌కి గౌర‌వం ఉండ‌దు! అని విరాట్ సీరియ‌స్ కామెంట్ పెట్ట‌డం వాడి వేడి చ‌ర్చ‌కే తెర‌లేపింది. కాక‌పోతే మ‌ధ్య‌లో మ‌న్మోహ‌న్ సింగ్‌, రోహిత్ శ‌ర్మ‌, హ‌నీసింగ్‌ని ఎందుకు ఇరుకించాడో అర్థం కాలేదు. అస‌లింత‌కీ విరాట్ మైండ్‌లో ఏం ఉందంటారు?