ఆ రెండు వారాల్లో ‘బ్లాక్ అండ్ వైట్‌’ గేమ్‌!!

Monday, November 28th, 2016, 08:02:44 PM IST

jagan
500, 1000 నోట్లు ర‌ద్దు చేస్తున్నామంటూ ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన వెంట‌నే కొన్ని ధిక్కార స్వ‌రాలు బ‌లంగా వినిపించాయి. మాయావ‌తి, కేజ్రీవాల్‌, కేసీఆర్ స‌హా ప‌లువురు నేత‌లు అదే ప‌నిగా ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. ఆ ఒక్క దెబ్బ‌కు కొన్ని వంద‌ల మందికి గూటం క‌దిలిపోయింది. అయినా చాలా మంది న‌ల్ల‌దొర‌లు బ‌య‌ట‌ప‌డ‌లేదు. సేమ్ టైమ్ వైకాపా అధినేత వైయ‌స్ జ‌గ‌న్ సైతం మాయావ‌తిని, కేజ్రీని మించి తీవ్రంగా విరుచుకుప‌డ‌తాడ‌ని అనుకున్నారు కామ‌న్ జ‌నం. అయితే జ‌గ‌న్ మాత్రం పిన్‌డ్రాప్ సైలెన్స్‌. ఓవైపు జ‌గ‌న్ క‌లుగులోంచి బ‌య‌ట‌కు రాలేదే.. విమ‌ర్శించ‌లేదే..అంటూ విప‌క్షాల నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటే అప్ప‌టికి రెండు వారాల త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చిన జ‌గ‌న్ ప్రధాని నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ రెండు వారాలు జ‌గ‌న్ ఏం చేశారు? అంటే ఉన్న బ్లాక్‌ని సాధ్య‌మైనంత వ‌ర‌కూ వైట్ చేసుకోవ‌డం ఎలా? అన్న‌దానిపైనే దృష్టి సారించాడ‌ని.. అందుకు త‌న ఆస్థాన విద్వాంసుడు విజ‌య‌సాయి రెడ్డిని ఆదేశించార‌ని ఏపీ తేదేపా నేత‌లు బ‌హిరంగంగానే అంటున్నారు.

జ‌గ‌న్ వ‌ద్ద వేల కోట్ల బ్లాక్‌మ‌నీ ఉంది. దానిని వెంట‌నే వైట్ చేయ‌డం ఎలా? అన్న ప‌నిలో విజ‌య‌సాయిని పుర‌మాయించారు. అందుకే ఆయ‌న ఆ రెండు వారాలు అస్స‌లు క‌నిపించ‌లేదు అంటూ ముచ్చ‌ట్లాడుకుంటున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ రెండువారాల పాటు ధిక్కార స్వ‌రం వినిపించ‌క‌పోవ‌డం వెన‌క అస‌లు మ‌త‌ల‌బు బ్లాక్ గంద‌ర‌గోళ‌మేన‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ల‌క్ష కోట్లు సంపాద‌న వెన‌క విజ‌య‌సాయి రెడ్డి పాద‌ర‌సం లాంటి బ్రెయిన్ ప‌నిచేసింది. అదే బ్రెయిన్ ఇప్పుడు బ్లాక్‌ని వైట్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది అంటూ ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. ఏదైతేనేం ఆ రెండు వారాలు ర‌హ‌స్య వారాలు అంటూ ఏపీ తేదేపాలో ఇన్న‌ర్‌గా మాట్లాడుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది.