హాట్ టాపిక్: పవన్ కోసం అలీ పార్టీ మారనున్నాడా?

Sunday, January 26th, 2020, 10:29:49 AM IST

పవన్ కళ్యాణ్ అలీ ల స్నేహం గురించి చాల మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ చాల సార్లు అలీ ఫై ఎంతో ప్రేమ చూపించారు. అలీ నా గుండెకాయ అంటూ అప్పట్లో స్టేజి ఫై చెప్పేసారు. ఎన్నికల ముందు ఎవరూ ఊహించని విధంగా అలీ వైసీపీ లోకి చేరిపోయారు. పవన్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండటం, అలీ వైసీపీ లో చేరడం లాంటి సంఘటనలతో తెలుగు నాట చాల ఆసక్తికర పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే ఆలీ ప్రస్తుతం వైసీపీ నుండి బీజేపీ లోకి చేరతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా పవన్ బీజేపీ తో పెట్టుకున్న విషయం పట్ల వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలీ వైసీపీ లోకి చేరాక, తాను ఊహించినట్లుగా ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాక కూడా అలీకి ఎలాంటి పదవి ని కట్టబెట్టలేదు. అయితే ఈ విషయం లో అలీ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజా పరిణామాలతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలీ బీజేపీ లో చేరనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే అలీ బీజేపీ లోకి చేరేందుకు పవన్ కూడా ఒక కారణం అని తెలుస్తుంది. మరి రాజకీయంగా విడిపోయిన పవన్, అలీ లు అదే రాజకీయాల్లో కలుస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.