బీజేపీ అద్యక్షుడిగా లక్ష్మణ్‌ని కొనసాగిస్తారా లేక మార్పు జరగబోతుందా..!

Wednesday, September 11th, 2019, 05:45:34 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ ఈ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో మాత్రం టీఆర్ఎస్ అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 4 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది.

అయితే ప్రస్తుతం వలసలతో, సభ్యత్వాలతో తెలంగాణలో బీజేపీ బలపడినట్టు కనిపిస్తుంది. అయితే ఇదే నేపధ్యంలో పార్టీనీ మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడి మార్పును కూడా హైకమాండ్ ఆలోచిస్తుందట. అయితే ప్రస్తుతం బీజేపీ పుంజుకోవడంతో మళ్ళీ తనకే అవకాశం కల్పించాలని, తన నాయకత్వంలోనే పార్టీ బలోపేతం అయ్యిందని లక్ష్మణ్ అధిష్టానాన్ని కోరుతున్నాడట. అయితే మార్పు జరపాలా లేక కొనసాగించాలా అనే దానిపై బీజేపీ కసరత్తు చేస్తుండడం, ఒక వేళ మార్పు జరిగితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరును పరిశీలిస్తునట్టు పార్టీలో సమాచారం.