ఏపీలో ‘కాపు’ గేమ్‌.. బొండా ఉమ న్యూహీరో?!

Thursday, September 22nd, 2016, 02:30:30 PM IST

bonda-uma
ఓవైపు కాపునేత‌లంతా ఏక‌మై ఇత‌ర సామాజిక వ‌ర్గాల ఏలిక‌ల్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఏపీలో కొత్త ప‌రిణామం. ముద్ర‌గ‌డ పుణ్య‌మా అని కాపులంతా ఐక్య‌త కోసం ముందుకొచ్చారు. ఇది పాల‌న‌లో ఉండేవాళ్ల‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో మెజారిటీ పార్ట్ రాజ‌కీయాల్ని శాసించేది కాపునేత‌లే అన్న ఫీలింగ్‌ని ఎలివేట్ చేస్తున్నారు.

అయితే ముద్ర‌గ‌డ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి, దాస‌రి .. వీళ్లంద‌రికీ వేరొక ప్ర‌త్యామ్నాయం ఉంది అంటూ కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. కృష్ణా- గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఉద్ధండుడిగా పేరున్న యువ‌నేత‌ బొండా ఉమ కాపు కార్డును సమ‌ర్థంగా వినియోగిస్తున్నార‌న్న టాక్ ఉంది. త్వ‌ర‌లో జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఆ మేర‌కు ప‌లు కాపు సంఘాల నేత‌లు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నాయకత్వంలో చంద్ర‌బాబును క‌లిసి వినతిప‌త్రాన్ని అంద‌జేశారు.

వీళ్ల డిమాండ్లివి:
1)ఏటేటా 1000 కోట్లు కాపు సంక్షేమ నిధి మ‌స్ట్‌గా అందాలి.
2)13 జిల్లాల్లో ప్ర‌తి జిల్లాలో ఐదెక‌రాల్లో కాపు సంక్షేమ భ‌వంతిని ఏర్పాటు చేయాలి.
3)రాజ‌ధాని కాపు సంక్షేమం కోసం 10 ఎక‌రాలు, నిధులు కేటాయించాలి.
4)బొండా ఉమ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి.