చంద్రబాబు టార్గెట్ ఏమిటి? బాధితులకు సహాయం ఓకే!.. కానీ

Wednesday, September 11th, 2019, 08:11:39 AM IST

చంద్రబాబు నాయుడు మంగళ వారం, న్యాయ విభాగం ఆత్మీయ సదస్సు లో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. రివర్స్ టెండర్ల స్థానం లో రివర్స్ ఎన్నికలు వస్తే బావుంటుంది. కానీ మూడేళ్ళలో జమిలి ఎన్నికలొస్తాయి అని చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తల పై వైసీపీ ప్రభుత్వ దాడులకు నిరసనగా చలో ఆత్మకూరు ప్రకటించిన విషయం తెలిసిందే. కార్య కర్తల పై అన్యాయం గా ఎస్సి,ఎస్టీ అట్ట్రాసిటీ కేసులు నమోదయ్యాయని వాటిని కోర్ట్ లో మీ న్యాయవ్యవస్థ బాగా వాదించాలని చంద్రబాబు సెలవిచ్చారు.

చంద్రబాబు రివర్స్ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలలో 32 సీట్లతో చంద్రబాబు దారుణం గా ఓడిపోయారు. జగన్ భారీ మెజారిటీ తో గెలుపొందారు. అయితే ఇంకా వారు అధికార పార్టీ కి సవాళ్లు విసరడం ప్రభుత్వాన్ని ఒకింత లెక్క చేయని తనంగా చంద్రబాబు వున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా వున్నారు చంద్రబాబు. ఈ ఐదేళ్ళలో జగన్ ని టార్గెట్ చేసుకొని టీడీపీ ని బలోపేతం చేసుకొని ప్రజలకు అండగా వుంటూ, అధికార పార్టీ ని ముప్పుతిప్పలు పెట్టబోతున్నారని అనిపిస్తుంది. ఏదైనా ఎన్నికల ఓటమి చంద్రబాబు ని బాగా కలచివేసింది అని చెప్పాలి. 40 ఏళ్ళ రాజకీయం లో అధికారం లో వుండి, తన కంటే వయసులో చిన్న ఐన వ్యక్తి సీఎం గా ఉండటం వలన జగన్ పై ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలు అని చెప్పవచ్చు.