ఈసారైనా నిహారిక కలలు ఫలిస్తాయా?

Tuesday, July 24th, 2018, 10:42:02 PM IST

ఎవరైనా హీరో ఒక పెద్ద ఫామిలీ నుండి హీరోగా వస్తున్నారంటే వాళ్ళ అభిమానులనుండి అతనికి లభించే ఆదరణ, ఆహ్వానం నిజంగా చాలా గొప్పగా వుంటుందనే చెప్పాలి, ఇక ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాక మెల్లగా తనను తాను నిరూపించుకుంటే భవిష్యత్తు బంగారుమయమే అవుతుంది. అదే ఒక అమ్మాయి పెద్ద ఫామిలీ నుండి హీరోయిన్ గా వస్తోంది అంటే మాత్రం వారికి సరైన ఎంకరేజ్మెంట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆ పెద్ద ఫామిలీకి, ఆ హీరోలకు అభిమానులు ఇచ్చే రెస్పెక్టు దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక ఆ అమ్మాయిలు హీరోయిన్ గా నటించాక, ఆమె పక్కన నటించే హీరోలు కూడా వారితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై కూడా ఆచితూచి నడుచుకుంటుంటారనే విమర్శ కూడా వుంది. అయితే నిహారికకు మాత్రం తమ మెగా అభిమానుల నుండి మంచి ప్రోత్సాహం లభించినప్పటికీ ఆమె తన కెరీర్ పై మాత్రం కొంత ఆలోచనలో పడ్డట్లు సినీ వర్గాల సమాచారం. యాక్టింగ్ పరంగా, అందచందాల పరంగా అన్ని ఉన్నప్పటికీ కూడా తనకు ఎందుకో సక్సెస్ మాత్రం ఊహించిన స్థాయిలో దక్కలేదనేది ఆమె బాధట.

తెలుగులో చేసింది ఒక చిత్రమే అయినప్పటికీ, తొలి చిత్రం కాబట్టి తాను నటించిన ‘ఒక మనసు’ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అది పక్కా ఒక జానర్ లో నడిచే కథ అవడంతో, అన్నివర్గాల ప్రేక్షకులని ఆ చిత్రం అలరించలేక పెద్ద ప్లాప్ అయింది. ఇక ఆ తరువాత ఈ అమ్మడు తన తదుపరి చిత్రం కోసం చాలా సమయమే తీసుకుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్, అదేనండి కేరింత, ఫ్యాషన్ డిజైనర్ చిత్రాల హీరో, అతని సరసన హీరోయిన్ గానటిస్తోంది. ఒకరకంగా అతనికి కూడా కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవనే చెప్పాలి. ఇక ఈ సినిమా టీజర్ పర్వాలేదనిపించింది. పోతే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు యూనిట్ ఆమె అన్నయ్య రామ్ చరణ్ ను స్పెషల్ గా ఆహ్వానించింది. మొత్తానికి మెగా ఫామిలీ బ్రాండ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అమ్మడు ఈసారి ఏ మేర విజయం అందుకుంటుందో అని మెగాభిమానులు సహా అందరూ ఎదురుచూస్తున్నారు…..