జగన్ ముందున్న పెను సవాల్..పార్టీకు భారీ నష్టం తప్పదా.?

Sunday, June 2nd, 2019, 01:30:38 AM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నవ నూతన సీఎం అయినటువంటి వై ఎస్ జగన్ రానున్న రోజుల్లో పాలన ఏ విధంగా చేస్తారో అన్నది పెను సవాల్ గా మారనుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే జగన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలానే హామీలు ఇచ్చేసారు.అవన్నీ ఎలా నెరవేరుస్తారా అని ఒక పక్క వైసీపీ శ్రేణులు మరో పక్క ఏమన్నా తేడా జరిగితే విమర్శలు సంధిద్దామని ఇతర పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.దీనితో జగన్ పై మరింత భారం పడుతుంది.జగన్ చెప్పిన హామీల్లో ఓ హామీ వల్ల పార్టీకు భారీ నష్టం తప్పేలా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జగన్ మూడు దశల్లో అసలు రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చేసారు.

అయితే ఇది చెప్పినంత సులభంగా ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే మద్యం అనేది దశలు వారీగా నిషేధం చేసినా సరే దాని వల్ల రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది తప్ప ఒరిగేది ఏమీ లేదని తెలుపుతున్నారు.ఇదొక్క రత్నమే అనుకుంటే ముందు కొద్దీ కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం కానీ మరో పక్క జగన్ చెప్పిన పింఛను అంకెలు పెరిగిపోతాయి.అంటే అక్కడ అదనపు భారం తప్పదు ఓ పక్క రాష్ట్రానికి రెవెన్యూ తగ్గిపోతుంది దీనితో రాబోయే రోజుల్లో జగన్ కు గడ్డు కాలం తప్పదని చెప్పాలి.

ఇవి మాత్రమే కాకుండా జగన్ అనేక రకాల హామీలను కూడా ఇచ్చేసారు,అవన్నీ అధిక మొత్తంలో డబ్బులతో కూడుకున్నవే దీనితో జగన్ అసలు జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు?ఇప్పటికీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలా లాభాల బాట పట్టించడం చాలా కష్టం అందువల్ల జగన్ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయని వాటన్నిటిని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.