జనసేనాని ఈ సంచలనాత్మక నిర్ణయం కూడా తీసుకుంటారా?

Friday, June 7th, 2019, 10:52:49 AM IST

ఎట్టకేలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటమి అనంతరం బయటకు వచ్చారు.రాజకీయాలలో తన ప్రయాణం ముగిసిపోతుంది అని ఎంత మంది అంటున్నా సరే పవన్ తాను అలా చెయ్యబోడం లేదు అని నిరంతరం నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.అయినా సరే పవన్ పై ప్రజల్లో ఏదొకలా వ్యతిరేఖతను ఇతర పార్టీల వారు వారి ప్రాబల్యంతో మరియు వారి అను”కుల” మీడియాతో పవన్ పై గెలిచేసారు.దీనితో పవన్ కు ఇప్పుడొక విషయం అర్ధం అయ్యింది.

ఈ రోజుల్లో ఒక్క సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ఉంటే సరిపోదు.అన్ని రకాలుగా ప్రజల్లో తమ పార్టీ ఉండాల్సిందే అని నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి పార్టీ కీలక నేతల సమావేశంలో పవన్ చర్చించారు.దానికి ఒకే మార్గం ఉందని వారు కూడా పత్రికలు మొదలు పెట్టాలని భావిస్తున్నట్టుగా పవన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం జనసేన శ్రేణుల్లో ఇప్పుడు నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.

ఇదిలా ఉండగా జనసేన అధినేత ఈ నీచ రాజకీయాల్లో నిజాయితీగా నెట్టుకు రావాలంటే ఒక్క పత్రిక మాత్రమే ఉంటే సరిపోదు అని ఇప్పుడు మీడియా రంగంలో వారికంటూ ఒక ప్రత్యేక ఛానెల్ కానీ ఉన్నట్టయితే జనసేన అధినేతను రాబోయే ఎన్నికల్లో ఆపేవారు ఉండరని జనసేన శ్రేణులు తమ మనసులో మాటను బయట పెడుతున్నారు.

కానీ ప్రస్తుతానికి అయితే పవన్ ఆర్ధిక స్థోమత అంతంత మాత్రమే కావడం వల్ల ఒక ఛానెల్ పెట్టాలి అంటే అది భారీ వ్యయంతో కూడుకున్న పని అందువల్ల ఇది కాస్త లేట్ అవ్వొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.ఒకవేళ వారి అభిప్రాయం ప్రకారం జనసేన అధినేత నిజంగా ఛానెల్ పెట్టినా ఇప్పుడున్న మీడియా చానెళ్లను తట్టుకొని అది అంత తొందరగా నెట్టుకు రాగలదా? అన్న మరో అనుమానం కూడా ఉంది.మరి జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.