నాగ శౌర్య “నర్తనశాల” భారీ నష్టాల్ని చూడాల్సిందేనా..?

Wednesday, September 5th, 2018, 02:25:23 PM IST

యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం “నర్తనశాల”. ఈ చిత్రానికి ముందు “ఛలో” చిత్రం ఇచ్చిన మంచి విజయం తో అదే ఉత్సాహంతో తన తర్వాతి చిత్రం “నర్తనశాల” ని థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చేలా ఉంది. ఛలో సినిమా లాంటి మంచి వినోదభరితమైన చిత్రం తర్వాత ఈ చిత్రం మీద కూడా ప్రేక్షకులు మంచి అభిప్రాయం మరియు అంచనాలు ఏర్పరుచుకున్నారు. అయితే ఆ అంచనాలను అందుకునే విషయం లో నర్తనశాల చిత్రం విఫలం అయ్యిందా అంటే సినీ ప్రేక్షకులు అవుననే చెప్తున్నారు.

సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే సినిమా మీద మంచి టాక్ రాకపోవడం అంతే కాకుండా గీతగోవిందం వంటి క్రేజీ చిత్రం కూడా ఉండటం మూలంగా ఈ చిత్రాన్ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు. అయితే నర్తనశాల చిత్రం దాదాపుగా పన్నెండు కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. ఇది నాగ శౌర్య కెరీర్ లోనే పెద్ద మొత్తం గా చెప్పవచ్చు. కానీ సినిమా ఏ మాత్రం జనానికి నచ్చకపోవడంతో విడుదలైన నాలుగు రోజులకి ఒక కోటి నలభై ఏడు లక్షలు మాత్రమే వసూలు అయ్యినట్టు తెలుస్తున్నది. ఈ లెక్క ప్రకారం చూస్తే భారీ నష్టాలు తప్పేలా లేవు..

  •  
  •  
  •  
  •  

Comments