పవన్ కళ్యాణ్ ఆ రిక్వస్ట్ ని పట్టించుకుంటాడా !

Monday, February 5th, 2018, 05:24:17 PM IST

పొలిటికల్ గా బిజీ అయిపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలుచేసే ఆలోచన విరమించుకున్నట్లు ప్రకటించారు. పవన్ అభిమానులకు ఇది చేదు వార్తే అయినా పవన్ పూర్తిస్థాయి నాయకుడిగా ఎదుగుతున్నాడనే సంతోషం అభిమానుల్లో ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన పార్టీ పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం వీలు కాదు.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ చిత్ర ప్రీరిలీజ్ రాజమహేంద్రవరం లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్ లోవినాయక్ మాట్లాడుతూ  పవన్ కళ్యాణ్ కు సభాముఖంగా విన్నంపం తెలియజేసారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పటికీ తీరిక సమయాల్లో సినిమాల్లో నటించాలని కోరారు. వినాయక్ మెగా ఫ్యామిలిలో చిరు, రామ్ చరణ్, బన్నీ మరియు సాయిధరమ్ తేజ్ లతో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్, వివి వినాయక్ ల కలయికలో ఇంత వరకు ఓ చిత్రం కూడా రాలేదు.