బిగ్ న్యూస్: పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా?

Wednesday, November 13th, 2019, 02:06:45 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు జనసేన పార్టీ పై ఖచ్చితంగా పడతాయని చెప్పడం లో సందేహం లేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రజల ఫై ప్రభావం చూపుతున్నాయి. ఇసుక కొరత పై గళమెత్తి వైజాగ్ లో లాంగ్ మార్చ్ పేరిట గర్జించిన పవన్ కళ్యాణ్, ఈ మార్చ్ కొరకు టీడీపీ మద్దతు కోరడం జరిగింది. చంద్రబాబు కూడా అంగీకారం తెలపడం మాత్రమే కాకుండా అచ్చెన్నాయుడు ని కార్యక్రమానికి పంపడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు నవంబరు 14 న అనగా రేపు ఇసుక కొరత పై దీక్ష చేపట్టనున్నారు. దీనికి మద్దతు కావాల్సిందిగా జనసేనను కోరారు. వర్ల రామయ్య, అచ్చెన్నాయుడు పవన్ ని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.

అయితే నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా జగన్ పై విమర్శలు చేస్తూనే, టీడీపీ ని ఎక్కి పారేశాడు పవన్ కళ్యాణ్. మీ బెదిరింపులకు భయపడటానికి నేను తెలుగు దేశం పార్టీ నేతని కాదు అని అన్నారు. అయితే పవన్ ఈ విషయం లో మద్దతు ఇస్తే ఇక తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ ఒకటే అని ప్రజలు నమ్మడం ఖాయం. ఇన్ని రోజులు పవన్ పై ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు లాంటి విమర్శలు వచ్చాయి. ఒక వేళ పవన్ టీడీపీ కి మద్దతు తెలిపితే వైసీపీ నేతలు చేసిన విమర్శలు సబబే అని ప్రజలు కూడా ఆమోదించే అవకాశం వుంది. మరి ఈ విషయం లో పవన్ 2014 లో టీడీపీ కి మద్దతు తెలిపినట్లుగానే ఇపుడు కూడా చంద్రబాబు కి మద్దతు తెలిపి అదే తప్పు చేస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.